»   » షూటింగులో ప్రమాదం: హీరో సందీప్ కిషన్‌కు తీవ్ర గాయం

షూటింగులో ప్రమాదం: హీరో సందీప్ కిషన్‌కు తీవ్ర గాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ షూటింగులో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా ప్రమాదంజరిగింది. ఈ ఘటనలో సందీప్ కిషన్ తలకు బలమైనగాయుం అయినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే సందీప్ కిషన్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సందీప్ కిషన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'నక్షత్రం' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం మంగళవారం సెట్స్‌పైకి వెళ్లింది.

sundeep

షూటింగ్ తొలి షెడ్యూల్ యాక్షన్ సీన్లతో ప్రారంభించారు. పోరాట సన్నివేశాలు చేస్తుండగా సందీప్ కిషన్ తలకు బలమైన గాయం తగిలిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సందీప్‌ కిషన్‌కు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.

ఈ సినిమాపై సందీప్ కిషన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో సందీప్ కిషన్ కు ఒక్క హిట్టు కూడా లేదు. ఇటీవల విడుదలైన 'ఒక అమ్మాయి తప్ప' చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. కృష్ణ వంశీ లాంటి స్టార్ దర్శకుడితో చేస్తుండటంతో తనకు కలిసొస్తుందని భావిస్తున్నాడు.

English summary
Sundeep Kishan injured on sets while shooting for his untitled film directed by Krishna Vamsi. The incident took place while shooting a fight scene on Sundeep and other artists at Manikonda in the city.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu