»   » రామ్ చరణ్ ‘తుఫాన్’ నైజాం రైట్స్ ఎంతంటే?

రామ్ చరణ్ ‘తుఫాన్’ నైజాం రైట్స్ ఎంతంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ఈ చిత్రం నైజాం ఏరియా రైట్స్ ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ. 11 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మరో వైపు ఈ చిత్రం నెల్లూరు రైట్స్ ని క్రౌన్ మూవీస్ సంస్ధ రూ. 1.65 కోట్లు చెల్లించి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 6న జంజీర్/తుఫాన్ విడుదలవుతోంది. రాష్ట్ర విభజన ప్రకటన నేపధ్యంలో పెద్ద సినిమాలు విడుదల సమస్య ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా రామ్ చరణ్ చిత్రానికి నైజాం వరకూ హ్యాపీనే కానీ, ఆంధ్రా, సీడెడ్‌ల్లో తమ సినిమాలను విడుదల చేయనిస్తారా లేదా అనే డైలమా ఉంది. అయితే రిలీజ్ తేదీలో మార్పేమీ లేదని సమాచారం. నిర్మాతలు ఎట్టిపరిస్ధితులోలనూ మొదట అనుకున్న తేదీకే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రామ్ చరణ్ నటించని తొలి బాలీవుడ్ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రామ్ చరణ్‌తో జతకడుతోంది. రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలు, ప్రియాంకతో చేసే రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి.

రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.

English summary
Film Nagar buzz is that, Mega Power Star Ram Charan's Toofan nizam rights have been acquired by a famous distribution house for a 11 crore whooping price.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu