For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లిప్ లాక్ లతో రెచ్చిపోయిన హీరో,హీరోయిన్స్ (ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : నేడు ప్రేమికుల దినోత్సవం. ప్రేమ హద్దులు దాటితే చేరుకునేది ముద్దుల ప్రపంచంలోకే. ఈ రోజున కొన్ని జంటలకు ముద్దురోజు వేడుక కూడా. నేడు భారతీయ సినిమాల్లో ముద్దుల సన్నివేశాలు సర్వసాధారణమయ్యాయి. వాటిని ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు.

  ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాల్లో ప్రస్తుతం ముద్దుసీన్‌లు లేని సినిమాలు లేవంటే ఆశ్చర్యపోనక్కరలేదు.. గతంలో సినిమాల్లో రెండు ఆకులు, రెండు పువ్వులు చూపిస్తూ ముద్దు సన్నివేశాలు చూపించకుండా చూపించేవారు. ఇప్పుడా ట్రెండ్ మారింది.

  జబ్‌తక్‌హైజాన్‌: యశ్‌చోప్రా చివరి చిత్రమైన జబ్‌తక్‌హైజాన్‌ చిత్రంలో షారుఖ్‌ఖాన్‌ తన ముద్దుల నిషేధానికి స్వస్తి పలికి అందమైన కత్రినా కైఫ్‌తో తెరమీద ముద్దు పెట్టుకున్న దృశ్యమిది. వీరిద్దరూ కలిసి కొన్ని సన్నిహిత దృశ్యాలను సైతం చేశారు.

  స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: తొలిసారిగా చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన అలియాభట్‌, సిద్దార్థ మల్హోత్రా తమ మొదటి చిత్రంలోనే ఈ సీన్‌లో తెరకెక్కారు.

  ఇష్క్‌జాదే: బబ్లీ పరిణితిచోప్రా, అర్జున్‌కపూర్‌లు వెండితెరపై ముద్దు పెట్టుకునే దృశ్యం ఆకట్టుకునేలా ఉంటుంది.

  విక్కీడోనార్‌: విక్కీడోనార్‌ చిత్రంలో ఆయుష్కాన్‌ఖురానా, యమ్మీగౌతం ముద్దు సన్నివేశంలో చాలా ప్రశాంతంగా కన్పించారు.

  జిస్మ్‌ 2: అశ్లీల తార సన్నిలియోన్‌, సహనటులు రణదీప్‌ హుదా, అరుణోదయ్‌సింగ్‌లతో కూడిన ముద్దు సన్నివేశం భావోద్వేగంతో కూడుకున్నది.

  రాజాహిందుస్తానీ: బాలీవుడ్‌ సినిమాల్లో ఇది సుదీర్ఘ కాల ముద్దు సన్నివేశం. అమీర్‌ఖాన్‌ చిత్రంలో దాదాపు మూడు నిమిషాలు కరిష్మాకపూర్‌ను ముద్దుపెట్టుకుంటాడు. ఈచిత్రం 1996లో భారీ విజయం సాధించింది.

  రాక్‌స్టార్‌: పాక్‌ అందాలరాశి నర్గీస్‌ ఫఖ్రిని రాక్‌స్టార్‌ రణబీర్‌ ఉద్వేగభరితంగా ముద్దు పెట్టుకునే సన్నివేశం ఇది. ఈ షాట్‌ను డైరెక్టర్‌ ఇంతియాజ్‌ ఆలీ చిత్రీకరించారు.

  ధూమ్‌ 2: హృతిక్‌, ఐశ్వర్య ముద్దు సన్నివేశం అందరికీ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది. అయితే ఈ సన్నివేశంపై హృతిక్‌ భార్య సుజానే రోషన్‌ చాలా సాదాసీదాగా స్పందించింది. హృతిక్‌ తెరపై ముద్దుపెట్టుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదంది. తాను చేసే ముద్దు సన్నివేశం 'బెస్ట్‌ కిస్‌' అయి ఉండాలని వ్యాఖ్యానించడం మరీ విశేషం.

  మర్డర్‌: సీరియల్‌ కిస్సర్‌గా పేరొందిన ఇమ్రాన్‌ హష్మి, మల్లికల ముద్దు సన్నివేశం ఇది.

  ఏక్ దీవానా ధా: గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫెయిలైనా ఈ సీన్ మాత్రం హైలెట్ గా బాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయింది.

  విక్రమ్ భట్ దర్శకత్వంలో వచ్చిన రాజ్ 3 లో ఈ సీన్ సినిమా హిట్ కి సగం కారణం అంటారు. సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి,బెంగాళి బ్యూటీ బిపాసా బసు ఈ సీన్ లో రెచ్చిపోయి జీవించారు.

  ముఖేష్ భట్ నిర్మించిన బ్లడ్ మనీ చిత్రంలో ఈ సీన్ చాలా మందిని ఆకట్టుకుంది. కునాల్ ఖేము, కెనడా మోడల్ మియా ఈ సీన్ లో అదరకొట్టారనే చెప్పాలి. ఈ సీన్ చూసి ..కునాల్ నిజ జీవిత గర్ల్ ప్రెండ్ సోహ అలీ ఖాన్ చాలా కాలం మాటలతో మాటలు లేకుండా పోయాయని అప్పట్లో వినిపించింది.

  ఇష్కియా చిత్రంలో విద్యాబాలన్ చేసిన ఈ కిస్ సీన్ అప్పట్లో సంచలనం అయ్యింది. ఆ తర్వాత ఆమె డర్టీఫిక్చర్ లో ఇమ్రాన్ హష్మీతో లిప్ లాక్ కిస్ ఇచ్చి్ంది.

  కత్రినా కైఫ్ తన కెరీర్ లో వెండితెరపై చాలా మందికి ముద్దు లిచ్చింది కానీ ఈ లాంగ్ కిస్ కే బాగా పేరు వచ్చింది. జిందగీ నా మిలేగీ దొబ్రా చిత్రంలో ఆమె హృతిక్ రోషన్ కి ఇచ్చి అభిమానులను అలరించింది.

  బాలీవుడ్ బెబో కరీనా కపూర్ తన సూపర్ హిట్ చిత్రం జబ్ వుయ్ మెట్ చిత్రంలో ఆమె తన లాంగ్ టైమ్ మాజీ బోయ్ ప్రెండ్ షాహిద్ కపూర్ కి ఇలా ముద్దులతో ముంచెత్తింది. ఈ సీన్ అప్పట్లో బాలీవుడ్ లో చర్చనీయాంసమైంది.

  మారిన ట్రెండ్ ని గుర్తు చేస్తూ... బాలీవుడ్‌ సినిమాల్లో కొన్ని ముద్దుల సన్నివేశ చిత్రాలను వాలెంటైన్‌ దినోత్సవం సందర్భంగా అందించే సచిత్ర కథనం ఇది. ఆశ్వాదించండి.

  English summary
  Kissing on the screen is no big deal for today's present superstars and also for the promising stars. The innocent pecks, soft kisses and passionate smooches have apparently become a kind of trend these days in Hindi movies. From seniors such as Shahrukh Khan and Katrina Kaif, to juniors such as Alia Bhatt and Siddharth Malhotra, everyone was quite comfortable in getting intimate on the screen. Take a look at some of the most sizzling and intimate kisses in Bollywood films that released in the year of 2012.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X