»   » దర్శకరత్న దాసరి స్వయంగా ‘ట్రాప్’ చేసారు!

దర్శకరత్న దాసరి స్వయంగా ‘ట్రాప్’ చేసారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటుడు బ్రహ్మాజి ముఖ్యపాత్రలో, మహేంద్ర ఇఎంఎస్, కాత్యాయనిశర్మ, షాలు నటీనటులగా ప్రేమ కవితాలయ ఫిలిమ్స్ సంస్ధ నిర్మిస్తున్న చిత్రం "ట్రాప్". ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకరత్న దాసరి నారాయణరావు లాంచ్ చేసారు.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ట్రాప్ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత ఆళ్ళ స్వర్ణలత మాట్లాడుతూ కొత్తగా సినీ నిర్మాణంలోకి అడుగు పెడుతున్నాం, దాసరిగారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు.

Traap movie first look

దర్శకుడు ఫనీంద్ర మాట్లాడుతూ... బ్రహ్మాజి గారి క్యారక్టర్ సినిమాకు హైలెట్, ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది, సినిమా పిచ్చి మగాళ్ళకే కాదు ఆడాళ్ళకు కూడా ఇంతలా ఉంటుందా అనిపించింది నాకు మా నిర్మాత స్వర్ణలత గారిని చూసినప్పుడు, ఆమె అన్ని రకాలుగా సపోర్టు చేసారు అని తెలిపారు.

సినిమాకు మ్యూజిక్ : ఈశ్వర్, కెమేరా : ప్రవీణ్. కే, ఎడిటర్: రామారావ్ జెపి, నిర్మత: ఆళ్ళ స్వర్ణలత, రచన, దర్శకత్వం: వీ యస్ ఫణీంద్ర.

English summary
Traap movie first look launched by Dasari Narayana Rao.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu