»   » 'ట్రాఫిక్' డైరక్టర్ మృతి

'ట్రాఫిక్' డైరక్టర్ మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:'ట్రాఫిక్' చిత్రంతో భారతదేస సినీ పరిశ్రమని తనవైపుకు తిప్పుకున్న మళయాళి దర్శకుడు రాజేష్ పిళ్లె(41) కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన ట్రాఫిక్ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ తరువాత తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదలై మంచి విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆయన దర్శకత్వం వహించిన వెట్టా విడుదలైన మరుసటిరోజే మృతి చెందడం పలువురిని బాధాకరం.

పిళ్లె మృతికి బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. పిళ్లె తీసిన ట్రాఫిక్ హిందీ రీమేక్‌లో మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్రలో నటించారు. రాజేష్ పిళ్లె అకాల మరణం పట్ల పలువురు మలయాళ నటీనటులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

English summary
Malayalam director Rajesh Pillai, known for his trendsetter movie 'Traffic', died in Kochi at a private hospital, a reliable source close to him said. He was 41.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu