»   » రకుల్‌ప్రీత్ కోసం రోడ్డు మూసివేశారు...లాఠీ ఛార్జీ

రకుల్‌ప్రీత్ కోసం రోడ్డు మూసివేశారు...లాఠీ ఛార్జీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ స్టార్ హీరోయిన్ కోసం హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ పోలీసులు చూపిన అత్యుత్సాహం వాహనదారులను చాలా ఇబ్బందుల పాల్జేసింది. దాంతో ఇప్పుడు అందరి చేతా అందరి చేతా విమర్శలు పాలవుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... 'బహార్ కేఫ్' ను ప్రారంభించేందుకు సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్ వస్తుందని పోలీసులు ఓ రోడ్డును మూసివేశారు. దాదాపు మూడు గంటల పాటు రహదారిని మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పోలీసుల అత్యుత్సాహంపై మండిపడ్డారు. సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్ కోసం ప్రజలను ఇబ్బందులను గురి చేయడం తగదని అన్నారు.

మరో ప్రక్క .. సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్ వస్తారన్న సమాచారంతో అభిమానులు పెద్ద ఎత్తున ఎస్‌ఆర్‌నగర్ వచ్చారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాలు మీదుగా వాహనాలను దారి మళ్లించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై నిలబడటంతో నడిచేందుకు వీలులేని పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.

రకుల్ ప్రీతి మాట్లాడుతూ... మాట్లాడుతూ యువతకు నచ్చే నాణ్యమైన వంటకాలను అందించినప్పుడే ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు పాల్గొన్నారు.

Traffic snarls as Rakul Preethi inaugurates eatery

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రకుల్ కెరీర్ విషయానికి వస్తే..

ఎన్టీఆర్ తో చిత్రం, రవితేజ 'కిక్-2', బాలీవుడ్ మూవీ 'శిమ్లా మిర్చి' చిత్రాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్... రామ్ చరణ్ సినిమాలో షూటింగ్ లోనూ పాల్గొంటోంది. మిగతా చిత్రాల షూటింగ్ పూర్తి కావస్తున్నప్పటికీ రామ్ చరణ్ సినిమా మాత్రం ఇటీవలే ప్రారంభమైంది. సెప్టెంబర్ నాటికి విడుదల తేదీ ప్రకటించడంతో వీలయినంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ సినిమా ఎక్కువభాగం లండన్ లో చిత్రీకరణ జరుపుకోనుంది.

రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతూ... కరెంట్ తీగలాంటి షాక్ లతో... కుర్రకారును తన అందాలతో కిర్రెక్కిస్తోంది. లౌక్యంగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ బ్యూటీ... పండగచేస్కో సినిమాలో నటించడం మాటేమోకానీ... స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ.... కెరీర్ విషయంలోనూ నిజంగానే పండగచేస్కోంటోంది.

రవితేజతో నటిస్తున్న కిక్-2 విడుదల కాకముందే.. రామ్ చరణ్ సినిమాలో అవకాశం అందుకున్న రకుల్... మరోవైపు మహేశ్ సినిమాతో పాటు ఎన్టీఆర్-సుకుమార్ సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. సో.. ప్రస్తుతం రకుల్ ఖాతాలో నలుగురు స్టార్ హీరోల సినిమాలున్నాయన్నమాట.

ప్రస్తుతం ఎన్టీఆర్ తాజా చిత్రం సినిమా సుకుమార్ దర్శకత్వంలో జరుగుతోంది. సుకుమార్ తయారు చేసుకున్న కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్‌లను తీసుకున్నారు.

English summary
Rakul Preet Singh's presence at a food joint inauguration triggered traffic congestion near SR Nagar crossroads on Wednesday evening. Rakul Preet Singh inaugurated a branch of the popular Bahar Cafe adjacent to the SR Nagar police station.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu