»   » ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా.... ట్రాన్స్‌జెండర్!

ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా.... ట్రాన్స్‌జెండర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మళయాలం సూపర్ స్టార్ మమ్ముట్టి త్వరలో చేయబోతున్న 'పెరంబు' మూవీ చర్చనీయాంశం అయింది. అందుకు కారణం అ సినిమాలో హీరోయన్ గా ఓ ట్రాన్స్‌జెండర్ నటిస్తుండటమే. ఈ చిత్రంలో మమ్ముట్టి సరసన అంజలి అమీర్ అనే 21 ఏళ్ల టాన్స్ జెండరర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Peranbu

మళయాలంలో ఓ ట్రాన్స్ జెండర్ హీరోయిన్ గా నటించడం ఇదే తొలిసారి. ఒక స్టార్ హీరోతో కలిసి నటించడంపై అంజలి అమీర్ స్పందిస్తూ....'అంత పెద్ద స్టార్ తో పని చేయడం అంటే తొలుత భయం వేసింది. కానీ ఆయనతో పని చేసాక చాలా కంఫర్టబుల్ పీలయ్యాను. షూటింగ్ సమయంలో అన్ని విషయాల్లోనూ హెల్ప్ ఫుల్ గా ఉన్నారు' అని తెలిపారు.

Anjali Ameer

అంజలి అమీర్ బెంగులూరులో గ్యాజ్యువేషన్ చదువుతున్న రోజుల్లో.... 19 ఏళ్ల వయసులో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆమెగా మారిన తర్వాత మోడలింగ్ రంగం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.

అంజలి అమీర్ పాపులారిటీ సినిమా వారిని ఆకర్షించింది. అందంతో పాటు చక్కని అభినయం ప్రదర్శించే టాలెంట్ ఉండటంతో ఆమె హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నారు. 'పెరంబు' చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శీను రామస్వామి దర్శకత్వం వహిస్తుండగా, పిఎల్ థేనప్పన్ నిర్మిస్తున్నారు.

English summary
Popular Malayalam actor Mammootty will be working with a transgender in his forthcoming flick 'Peranbu'. And what's more heartening is the transgender will play as his heroine. Anjali Ameer (21) is the first transgender to foray into a mainstream Malayalam flick.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu