రంభగా హాట్ స్టార్ త్రిష ఖరారు

హీరోయిన్స్ ప్రాధాన్యం ఉన్న చిత్రంగా దీన్ని ఎమ్.ఎస్ రాజు తీర్చిదిద్దబోతున్నారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుంది. ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. దీంట్లో రంభగా త్రిష కనిపిస్తుంది. 'సీమ టపాకాయ్', 'అవును' చిత్రాల్లో నటించిన పూర్ణ మరో హీరోయిన్. మరో పాత్ర ఏ హీరోయిన్ కి దక్కిందీ త్వరలో తెలుస్తుంది. విదేశాల్లో కొంత మేరకు షూటింగ్ ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తారు.
త్రిషతో తొలి హిట్ కొట్టింది ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రాజు. ప్రభాస్ తో ఆయన బ్యానర్ లో వచ్చిన వర్షం చిత్రం రికార్డులు బ్రద్దలు కొట్టింది. ఆ తర్వాత అదే బ్యానర్ లో త్రిష..నువ్వు వస్తానంటే నే వద్దంటానా చిత్రం చేసి హిట్ కొట్టింది. కానీ అదే బ్యానర్ లో వచ్చిన పౌర్ణమి సినిమా త్రిషకు వెలుగులు ఇవ్వలేకపోయింది. దాంతో ఆ తర్వ త ఆమె ఆ బ్యానర్ లో చేయలేదు. అయితే తాజాగా రమ్ తో ఈ కాంబినేషన్ మరో హిట్ కొట్టినట్లే అంటున్నారు.
ఇక ఎమ్.ఎస్ రాజు..తొలిసారిగా మెగా ఫోన్ పట్టి..వాన అనే కన్నడ రీమేక్ చిత్రం రూపొందించారు. అయితే ఆ చిత్రం పాటలు హిట్టైనా, చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. ఆ తర్వాత తన కుమారుడుని పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో తూనీగ తూనీగ చిత్రం రూపొందించారు. ఆ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆయన ప్రస్తుతం ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











