»   » పవర్ స్టార్‌తో హీరోయిన్ త్రిష ‘దూకుడు’

పవర్ స్టార్‌తో హీరోయిన్ త్రిష ‘దూకుడు’

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Trisha in Dookudu Kannada remake
బెంగుళూరు: మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన తెలుగు చిత్రం 'దూకుడు' అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు అమితంగా ఆకట్టుకున్న సినిమాగా ఈ చిత్రం పేరు తెచ్చకుంది. ఈ చిత్రం త్వరలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా పునీత్ రాజ్ కుమారే అని అంటున్నారు.

ఇప్పటికే కన్నడలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుంది. తాజాగా అందుతున్న ఆసక్తికర సమాచారం ఏమిటంటే....ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. తెలుగులో సమంత పోషించిన పాత్రని.. కన్నడంలో త్రిష పోషించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషల్లో నటించిన త్రిష పలు విజయవంతమైన చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తొలిసారి ఆమె కన్నడలో 'దూకుడు' చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాకు త్రిష భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు కన్నడ చిత్రసీమలో చర్చ జరుగుతోంది.

త్రిష ఇతర సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆమె తెలుగులో 'రంభ ఊర్వశి మేనక', తమిళంలో 'భూలోగం', 'ఎండ్రెండ్రుమ్ పున్నాగై', 'కన్నాలే కన్నన్' అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్నీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది ఇవి విడుదల కానున్నాయి.

English summary

 Mahesh babu Dookudu is being remade in Kannada with Puneeth Rajkumar, and Puneeth himself is the producer. Reports had that Puneeth Rajkumar is insisting on roping in Trisha for the role of Samantha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu