»   » లైఫ్ ఐస్‌ క్రీమ్‌ లాంటిది..కరిగిపోయేలోపే ఆస్వాదించాలి: త్రిష

లైఫ్ ఐస్‌ క్రీమ్‌ లాంటిది..కరిగిపోయేలోపే ఆస్వాదించాలి: త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

'జీవితం ఐస్‌ క్రీమ్‌లాంటిది. కరిగిపోయేలోపే ఆస్వాదించాలన్నది నా పాలసీ" అంటున్నారు త్రిష. షూటింగ్స్ లేకపోతే చాలు.. ఏదో ఒక టూర్ ప్లాన్ చేసుకుని స్నేహితులతో సహా చెక్కేస్తారామె. మీకు టూర్లంటే ఇష్టమా? అన్న ప్రశ్న త్రిష ముందుంచినప్పుడు ఆమె పై విధంగా స్పందించారు. ఒకవైపు మంచి నటిగా పేరు తెచ్చుకోవడంతోపాటు మరోవైపు తనలో మంచి గ్లామరస్ నటి ఉన్న విషయాన్ని కూడా నిరూపించుకున్నారు త్రిష.

ఆ విషయం గురించి త్రిష మాట్లాడుతూ 'ప్రతిభకు అదృష్టం తోడైతే ఎలా ఉంటుందో చెప్పడానికి నా కెరీర్ ఓ ఉదాహరణ. నా ప్రతిభను నిరూపించుకునే విధంగా మంచి పాత్రలు వస్తున్నాయి. అలాగే ట్రెండీ హీరోయిన్ అనిపించుకునేలా గ్లామరస్ రోల్స్ చేసే అవకాశం కూడా వస్తోంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తున్నావు కదా? గ్లామరస్ రోల్స్ చేయడం అవసరమా? అని కొంతమంది నన్నడిగారు. గ్లామరస్ రోల్స్ చేయడం పాపమా? ప్రేక్షకులకు కావల్సింది అదే కదా. ట్రెండ్‌ కు తగ్గట్టుగా ఉండాలి. లేకపోతే 'అమ్మమ్మ" అని ముద్ర వేసేస్తారు. అందుకని మోడర్న్‌ గా ఉండటం తప్పు కాదు" అని లెక్చర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సరసన త్రిష కథానాయికగా నటించిన 'తీన్‌మార్"విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రం విడుదల దగ్గర పడుతున్న కొద్దీ చాలా థ్రిల్‌గా ఉందని త్రిష అంటున్నారు.

English summary
Every year Trisha goes for a year end holiday with close friends. The actress known to be a fun freak really loves to have breaks.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu