»   »  త్రిష కెరీర్ క్లైమాక్స్ చేరినట్లుంది.. లేకపోతే ఆ ఆపర్ ఎందుకొస్తుంది

త్రిష కెరీర్ క్లైమాక్స్ చేరినట్లుంది.. లేకపోతే ఆ ఆపర్ ఎందుకొస్తుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ హీరోయిన్ కైనా బాలీవుడ్ లో ఛాన్స్ వ స్తే ఎదుగుతున్నట్లు,భోజపురిలో ఆఫర్ వస్తే కెరీర్ చివరి దశకు వచ్చినట్లు అని సినీ పండితులు చెప్తూంటారు. బాలీవుడ్ లో సెట్ కాలేక వెనక్కి వచ్చిన త్రిషకు తాజాగా భోజపురి నుంచి వరసగా ఆపర్స్ వస్తున్నాయట.మంచి రెమ్యునేషన్స్ అక్కడివారు ఆఫర్ చేస్తునట్లు వినికిడి. గతంలో ఇక్కడ ఫేడవుట్ అయిన ఫిగర్లు నగ్మా,రంభా అక్కడికెళ్ళి ఒక ఊపు ఊపారు. దాంతో అక్కడ దర్సక,నిర్మాతల చూపు ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. తమకు పనికొచ్చే మాల్ ఏదన్నా ఉందేమోనని ఎప్పుడూ సెర్చ్ చేస్తూంటారు.

అలా వెతుకుతున్న వారికి కెరీర్ కుంగిపోతూ కనిపించిన త్రిష కనిపించింది. తెలుగులో వెంకటేష్ సరసన బాడీగార్డు రీమేక్ లో తప్ప ఆఫర్స్ లేన ి ఆమెను ఆదుకుని తమ భోజపురికి వన్నె తెద్దామని ఫిక్సయ్యారు.అయితే త్రిష మాత్రం ఆఫర్స్ అయితే వస్తున్నాయి కానీ నేనంత ఖాలీగా లేను..రీసెంట్ గా కన్నడంలో దర్శన్ సినిమాలో హీరోయిన్ గా కమిటయ్యాను కూడా అంటోంది.కన్నడంకి వెళ్తోందంటే అర్దం తెలుగు,తమిళ తంబీలకు ఆమె కిక్కు ఇవ్వలేకపోతోందనే కదా.అయినా యంగ్ హీరోలెవరూ ఆమెను తమ ప్రక్కన నటించటానికి ఒప్పుకోవటం లేదు. అదో పెద్ద సమస్య.

English summary
The Bhojpuri film industry is wooing Trisha big time, hoping to get her to sign on the dotted line for a few of their films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu