»   » త్రిష ఎందుకింత లేట్ చేసింది? చేజేతులా కెరీర్ కష్టాల్లోకి....

త్రిష ఎందుకింత లేట్ చేసింది? చేజేతులా కెరీర్ కష్టాల్లోకి....

Posted By:
Subscribe to Filmibeat Telugu

దీపం ఉంద గానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు కాస్త హైప్ ఉన్నప్పుడే సినిమా రిలీజ్ చేసుకోవాలి. వార్తల్లో తప్ప థియేతర్ లో కి రాని సిఒనిమాకి విజయావకాశాలు సగానికి సగం పడిపోతాయన్న సంగతి తెలియంది కాదు. మరి ఇన్ని తెలిసినా త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన "నాయకి" టీం మాత్రం ఇంకా మేలుకోవటం లేదు

ఈ సినిమాకు ఆడియో వేడుక నిర్వహించి మూడు నెలలు దాటుతోంది. తెలుగు లో టాప్ హీరో అయిన బాలయ్య స్వయంగా వచ్చి ఆడియో విడుదల చేయడం.. త్రిష హాట్ హాట్ అందాలతో రెచ్చగొట్టడంతో "నాయకి" మీద బాగానే చర్చ జరిగింది. థియేట్రికల్ ట్రైలర్ కూడా పర్వాలేదనిపించింది. అసలే హారర్ కామెడీ ట్రంద్ నడుతున్న సమౌయం కావతం తో జనాల్లో సినిమా మీద కొంచెం ఆసక్తి రేగింది. కానీ ఏమైందో ఏమో గానీ ఆ తర్వాత సినిమా వార్తల్లో లేకుండా పోయింది.

trisha

ఇప్పుడు ఉన్న హైప్ కాస్తా పోయాక దాదాపు అంతా ఈ సినిమాని మర్చిపోయే టైం లో "నాయకి" సినిమాకు సంబంధించి సెన్సార్ కబుర్లు వినిపిస్తున్నాయి. ఈ హార్రర్ కామెడీ "ఎ" సర్టిఫికెట్ తెచ్చుకుందత.హార్రరే కాదు కాస్త గ్లామర్ కూడా ఎక్కువే అయినట్టుంది. అందుకే ఏ సర్టిఫికెట్ తో సరిపెట్టారు. సెన్సార్ అయితే అయ్యింది కానీ.. రిలీజ్ డేట్ సంగతి మాత్రం చెప్పలేదు దర్శక నిర్మాతలు.

ఇప్పటికే రెందు మూడు నెలలు గా నానుతున్న సినిమా.... ఇక ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యి ఇంకో మూడు నెలల పాటు ఎంగేజ్ అయిపోయాయి థియేటర్లన్నీ... నాగ చైతన్య, యంగ్ టైగర్, వెంకటేష్ ల సిఒనిమాలు వరుసగా రానున్నాయి. సో ఇప్పట్లో "నాయకి" వచ్చినా ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు మరి. అసలే అవకాశాలు తగ్గిపోయిన సమయం లో మరో ఫ్లాప్ అంటే త్రిష మరింత వెనక్కి జరిగి పోయినట్టే. ఇప్పుడు గనక నాయకి ఫ్లాప్ అయిందంటే ఇక త్రిష కి అవకాశాలు ఆగిపోతాయనే చెప్పొచ్చు..

ఇంతకుముందు "లవ్ యు బంగారం" అనే ఫ్లాప్ మూవీ తీసిన గోవి ఈ చిత్రానికి దర్శకుడు. కమెడియన్ సత్యం రాజేష్ మామూలు గానే "నామ్ కే వాస్తే హీరో" గా చేసాడు. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటిదాకా వచ్చిన హార్రర్ కామెడీల తరహాలోనే ఈ సినిమా వచ్చినా త్రిష నే ఈ సినిమా కి ఉన్న ఒకే ఒక ప్రత్యేకత. కానీ ఇప్పుడు ఆ గ్లామర్ కూదా పని చేసేలా లేదు మరి. ఇక నాయకి ఎప్పుడు వస్తుందో ఏం చేస్తుందో చూడాలి మరి....

English summary
Trisha's latest movie "Nayaki", has completed its censor formalities the other day. Censor Board has awarded "A" certificate in Hyderabad. The audio release event of the film happened way back in April and the makers are waiting for right time for release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu