»   »  త్రిష, ఇలియానాల నడుమ ఎన్టీఆర్?

త్రిష, ఇలియానాల నడుమ ఎన్టీఆర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jr Ntr
కంత్రీ తరువాత ఎన్టీఆర్‌ ఏ సినిమాలో నటిస్తాడనేది అభిమానుల్లోనే కాక పరిశ్రమలో కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి దానికి తెర పడే వార్త ఇప్పుడు వినపడుతోంది. కొడాలి నాని, వంశీ సంయుక్తంగా నిర్మించబోయే ఆ క్రేజీ ప్రాజెక్టు వి.వి.వినాయక్‌ దర్శకత్వం లో రూపుదిద్దుకోబోతోందిట. కృష్ణ సినిమాతో హిట్ లో ఉన్న వినాయక్ తన తరువాత ప్రాజెక్టును అప్పగించటం కరెక్టని, దీని ద్వారా కెరీర్ మరింత ముందుకు వెళ్తుందని ఎన్టీఆర్‌ భావించారట. 'ఆది', 'సాంబ' చిత్రాల తర్వాత వీ.వీ.వినాయక్, ఎన్టీఆర్, కొడాలి నాని కాంబినేషన్లో రూపుదిద్దుకోనున్న మూడో చిత్రమిది. మరి ఈ చిత్రంలో ఎవరు కథానాయకలుగా నటిస్తున్నారన్నదానికి ఇలియానా, త్రిష పేర్లు పోటీ పడ్డాయట. దాంతో ఇద్దరూ ఉంటే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారట. ఈ నెల 28న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభించటానికి ప్లానింగ్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సంకల్పించినట్టు తెలుస్తోంది. ఇది మారని నిర్ణయమైతే ప్రేక్షకులకి ఇలియానా, త్రిష ఇద్దరి అందాలు ఒకేసారి చూసే అదృష్టం దక్కుతుందన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X