వాళ్లు వద్దంటూ...నోటికి పనిచెప్పిన త్రిష

తమిళ చిత్రం 'మంకాత్తా' చిత్రం కోసం తొలిసారి డబ్బింగ్ చెప్పుకున్న త్రిష ఇకపై తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయంపై త్రిష స్పందిస్తూ ' తొలిసారి 'మంకాత్తా' చిత్రం కోసం డబ్బింగ్ చెప్పాను. అందులో నా వాయిస్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఆ స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తారని ఊహించలేదు. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడంలో ఇంత అనుభూతి కలుగుతుందని అనుకోలేదు. ప్రేక్షకుల స్పందనను దృష్టిలో పెట్టుకుని ఇకపై తెలుగు, తమిళ భాషల్లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం తమిళంలో విశాల్‌తో 'సమరన్'లో నటిస్తున్నాను. ఈ చిత్రానికీ నేనే డబ్బింగ్ చెబుతున్నాను' అని తెలిపింది త్రిష.
త్రిష ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన 'దమ్ము' చిత్రంలో నటిస్తోంది. ఆమె వెంకీతో కలిసి నటించిన 'బాడీగార్డ్' సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయానికి తోడు 'దమ్ము' చిత్రంలో కూడా చేస్తుండటంతో తెలుగులో త్రిష జోరు మళ్లీ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











