»   » తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే త్రిష

తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇష్టంతో చేస్తే ఎంతటి కష్టమైన పనినైనా అవలీలగా సాధించవచ్చు అని మన పెద్దలు అంటుంటారు. త్రిష కూడా ఇదే విషయం చెబుతుంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజుల్లో షూటింగ్ అంటే చాలా బోర్ కొట్టేదట..రాను రాను దాని పై ఇష్టం పెంచుకోవడంతో ఇప్పుడు 24 గంటలు షూటింగ్ చేయమన్నా చేస్తానంటుంది.

ఈ మధ్య తెలుగు చిత్రాల మీద ఇష్టాన్ని తగ్గించుకుని బాలీవుడ్ చిత్రాలంటే ఇష్టం పెంచుకున్న త్రిష ఇలా చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్నీ కలిగిస్తున్నది. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే త్రిష..ఈ మాటలు మాట్లాడటానికి అర్హత కూడా కోల్సోయింది. అంటున్నారు సినీ విమర్శకులు. ఈ మధ్య తెలుగు చిత్రం రవితేజ సరసన (డాన్ శీను)లో నటించే అవకాశాన్ని వదులుకున్న విషయం తెలిసిందే. మరి అయితే గతంలో ఈమె లాగే చేసిన శ్రియ, చేసిన తప్పు తెలుసుకోవడంతో ఆ అవకాశం ఆమెను వరించింది.

ఇన్నీ జరుగుతున్నాటాలీవుడ్ నుండి వెళ్లి పోతానంటే ఎవ్వరూ ఆపరు..రోజుకో ముంబాయి భామ మార్కెట్ లో దొరుకుతుంది. మొదటి గా వచ్చే వారి రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువకావడంతో వారిని తెచ్చుకోవడానికి దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. కాబట్టి పోయినోళ్లు..ఉన్నవారి తీపి గుర్తులు అన్నట్లుగా..ఇప్పటి వరకు త్రిష టాలీవుడ్ లో చేసిన సినిమాలు తీపిగుర్తులే అన్న మాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu