»   » నాయుడుగారి కుటుంబంలో త్రిష పేరు, నిజమా?

నాయుడుగారి కుటుంబంలో త్రిష పేరు, నిజమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దగ్గుబాటి యువ హీరో రానా, సౌతిండియా స్టార్ హీరోయిన్ త్రిష మధ్య క్లోజ్ నెస్ కారణంగా...ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ ఉందని, ‘సం'బంధం ఉందని గత కొన్నేళ్లుగా ప్రచారం జరింది. పలు సందర్భాల్లో తమ మధ్య అలాంటిదేమీ లేదు, మేము కేవలం స్నేహితులం మాత్రమే అని అటు రానా, ఇటు త్రిష వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వరుణ్ మణియన్ తో త్రిష ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఈ రూమర్లకు తెర పడింది.

తాజాగా రానా, త్రిష పేర్లు మళ్లీ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇది ఆ విషయం గటురించి మాత్రం కాదు. త్వరలో రానా, వెంకటేష్ కాంబినేషన్లో ‘నాయుడుగారి కుటుంబం' అనే మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల దివంగతులైన ప్రముఖ నిర్మాతరామానాయుడు తన వారసులతో కలిసి ఈ సినిమా అప్పట్లోనే చేద్దామనుకున్నారు కానీ వీలు కాలేదు.

Trisha Is A Part Of Naidu Gari Kutumbam?

అయితే రామానాయుడు తలపెట్టిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రస్తుతం ఆయన వారసులనైన సురేష్ బాబు, వెంకటేష్, రానా అనుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల బోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ త్రిష కూడా నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రానా, వెంకటేష్ లలో త్రిష ఎవరికి జోడీగా నటిస్తుంది? అనే ఇంకా తెలియలేదు. గతంలో పలు చిత్రాల్లో వెంకీకి జోడీగా త్రిష నటించిన నేపథ్యంలో ఈ చిత్రంలోనూ ఆమె వెంకీ సరసన నటించే అవకాశం ఉందని అంటున్నారు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.... రామానాయుడు మనవుడు నాగ చైతన్య కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తారని అంటున్నారు. ప్రస్తుతం కథ సిద్ధం అయిందని, త్వరలోనే సినిమా సెట్స్ మీదనకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. బాబాయ్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నట్లు రానా కూడా ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

English summary
The patch up, we are taking about, is just for a film. But it has been creating tremors in the film circles, as it is a prestigious Daggubati family film. If the buzz is to be believed, Trisha will be a part of Daggubati's family film, Naidu Gaari Kutumbam.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu