»   » వామ్మో..! త్రిష మోహిని ఫస్ట్ లుక్ ..!! ఇదేంట్ సామీ ఏమిటీ మోడరన్ ఖాళీ మాత అవతారం

వామ్మో..! త్రిష మోహిని ఫస్ట్ లుక్ ..!! ఇదేంట్ సామీ ఏమిటీ మోడరన్ ఖాళీ మాత అవతారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేమకథలు, కుటుంబ చిత్రాల్లో నటించి బోరుకొట్టేసిందేమో తెలీదుగానీ నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా వరుసగా హర్రర్‌ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది దక్షిణాది బ్యూటీ త్రిష. 'అరణ్మనై'లో తొలిసారి దెయ్యంగా కనిపించిన త్రిష హర్రర్‌ కామెడీ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న 'నాయకి'లో లీడ్‌రోల్‌ పోషించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా మరో హర్రర్‌ చిత్రానికి ఓకే చెప్పింది. ప్రిన్స్ పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రమే 'మోహిని'. ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌.మాదేష్‌ దర్శకత్వం వహించాడు.

ఈ నేపథ్యంలోనే టీమ్ కొద్దిసేపటి క్రితం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఆ 'జగన్మోహిని'తో ఈ త్రిష 'మోహిని'ని ఎంతవరకు పోల్చవచ్చోగానీ, త్రిష చేతులో కత్తుల్ని చూస్తోంటే మాత్రం, ఎక్కడో తేడా కొట్టేస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న 'మోహిని' సినిమాని హిందీలోకీ డబ్‌ చేసే ఆలోచనలైతే జరుగుతున్నాయట. ఇక, ఈ సినిమాని త్రిష పర్సనల్‌గా తీసుకుందనీ, ప్రమోషన్‌ బాధ్యతల్ని తన భుజాన వేసుకుందనీ తెలుస్తోంది. 'నాయకి' సినిమా ప్రమోషన్‌ కోసం త్రిష అస్సలు సహకరించలేదన్న విమర్శలున్నాయి. మరి, 'మోహిని' విషయంలో త్రిష ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.

Trisha Krishnan's Mohini first look poster revealed

లండన్, థాయ్‌ల్యాండ్‌లలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తైందట.వెస్ట్రన్ అవతారంలోని అమ్మవారిలా మోహిని ఫస్ట్‌లుక్ డిజైన్ చేశారు. మోహిని చిత్రంలో ఈ అమ్మడు దాదాపు న్యూడ్ గా కొన్ని సీన్లలో కనిపించనుందట. ఫ్యాంటసీ తరహీ రూపొందబోయే ఈ చిత్రంలో త్రిష అలా నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. సెమీ న్యూడ్ సీన్లు అనగానే కుర్రకారు కళ్లు అప్పగించి చూడటం ఖాయం.

ఇక ఈ లుక్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో రెండు రకాల స్పందనలు వినిపిస్తున్నాయి. త్రిష లాంటి టాప్ హీరోయిన్ ఇలా ఒక డిఫరెంట్ సినిమా చేయడంతో పాటు, లుక్‌ పరంగానూ ఇంత డిఫరెంట్‌గా కనిపించడం పెద్ద సాహసమే అని కొందరు ప్రశంసిస్తూ ఉండగా, మరికొందరు పెదవి విరిచేస్తున్నారు. ఈ లుక్‌లో త్రిష ఎబ్బెట్టుగా ఉన్నారని, ఇదేం లుక్ అంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి విభిన్న స్పందనలు తెచ్చుకున్న ఈ మోహిని, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.

English summary
Trisha Krishnan stunned her fandom with her new avatar in Tamil horror movie, Mohini. Inspired by Avatar and Hindu mythology, the actor is all-blue and wielding weapons in her eight arms like Goddess Durga.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu