»   » త్రిష చేతిలో ఉన్న ఆఫర్లెన్నో తెలుసా..., అసలు ఎలా ఇంత చేస్తోంది???

త్రిష చేతిలో ఉన్న ఆఫర్లెన్నో తెలుసా..., అసలు ఎలా ఇంత చేస్తోంది???

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్‌ హీరోయిన్‌గా దశాబ్ధ కాలం తిరుగులేని స్థానంలో కొనసాగింది త్రిష. అసలు ఈ అమ్మడు లేనిదే టాలీవుడ్‌, కోలీవుడ్‌ లేనేలేవు అనే పరిస్థితివుండేది . అలాంటి క్రేజ్ ఏమైందో? త్రిష పూర్తిగా ఖాళీ అయిపోయింది. 30ప్లస్‌ భామగా అమ్మడిని హీరోయిన్ల జాబితా నుంచి తీసేశారు మన నిర్మాతలు. ఇక కెరీర్‌ ముగిసినట్టే అనుకుంటున్న టైమ్‌లో -కన్నడలో మన 'దూకుడు' రీమేక్‌లో నటించి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది.

ఇక ధనుష్ తో చేసిన కొడి తో గ్లామర్ హీరోయింగా కూడా తాను తక్కువేమి కాదని నిరూపించుకుంది. వరుణ్ మణియన్ అనే తమిళ నిర్మాతను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైపోవడానికి కూడా త్రిష రెడీ అయింది. కానీ అతడితో ఎంగేజ్మెంట్ రద్దవడం.. త్రిష కెరీర్ ఊపందుకోవడం ఒకేసారి జరిగాయి. వరుసగా మంచి అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది త్రిష.

Trisha Krishnan will feature in Hari's Saamy 2 with Vikram

14 ఏళ్ల కిందట విక్రమ్ సరసన త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'సామి'. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. ఇందులో విక్రమ్‌నే హీరోగా ఎంచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ త్రిషనే కథానాయికగా తీసుకోవడం మాత్రం ఆశ్చర్యమే. కానీ ఈ పాత్రకి త్రిష తప్ప వేరేవరూ న్యాయం చేయలేరనిపించిందట దర్శకుడికి. ఎక్కడినుండి మొదలయ్యానో మళ్లీ అక్కడికే వచ్చానంటూ ట్వీట్ చేసి ఈ వార్తను అధికారికంగా ఖరారు చేసింది.

2003లో విడుదలైన 'సామి' మొదటి భాగం భారీ హిట్‌గా నిలిచి విక్రమ్, త్రిష, దర్శకుడు హరిలకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. విక్రం నటించిన సామి చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌ వస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తమ అభిమాన హీరోను మళ్లీ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారి పాత్రలో చూడటానికి ఉత్సుకత చూపుతున్నారు.

Trisha Krishnan will feature in Hari's Saamy 2 with Vikram

అంతేకాక గరుడ సినిమా కొన్ని కారణాలతో ఆలస్యమవుతున్నట్లు సమాచారం. అందుకే హరి దర్శకత్వంలోని సామి 2 సినిమాను వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని విక్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ప్రస్తుతానికి త్రిష ఏ యంగ్ హీరోయిన్ కన్నా తక్కువ లేదు ఈ సామి 2 తో పాటుగా మోహని.. గర్జనై.. 1818.. శతురంగ వేట్టై-2.. హేయ్ జూడ్.. 96 అనే ఐదు సినిమాల్లో త్రిష కథానాయికగా నటిస్తోంది. 34 ఏళ్ల వయసులో ఒక సౌత్ హీరోయిన్.. ఇంతటి ఊపు చూపించడం అన్నది మామూలు విషయం కాదు.

English summary
Vikram and Trisha will star in the sequel to super hit cop-thriller Saamy, directed by Hari.and trisha Bagged another 5 offers in tamil
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu