twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రిష చేతుల్లో “నందమూరి శిఖరం ” (ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ త్వరలో 100 సినిమాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా 'నందమూరి శిఖరం' పేరుతో 1000 పేజీల పుస్తకం రూపకల్పనకు యన్.బి.కె. హెల్పింగ్ హాండ్స్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నందమూరి శిఖరం ఫేస్ బూక్ పేజ్ ని ప్రముఖ సినీ నటి త్రిష చేతులమీదుగా ఆవిష్కరణ చేసారు. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న లయిన్ చిత్రం షూటింగ్ లో ఈ ఆవిష్కరణ జరిగింది. బాలకృష్ణ సరసన త్రిష ఈ చిత్రంలో చేస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    విశ్వవ్యాప్తంగా శత చిత్రాలు పూర్తిచేసుకొని అరుదైన చరిత్రకు శ్రీకారం చుట్టనున్న తొలి తెలుగు స్టార్ హీరో బాలయ్య 40 వసంతాలు పైగ తెలుగు సినీ పరిశ్రమతో ఉన్న అనుభందాన్ని , బాలయ్య శత చిత్రాల విశ్లేషణను, అరుదైన ఫోటోలను, బాలయ్య నటనా వైభావానికి సహకరించిన అన్ని రంగాల ప్రముఖులతో బాలయ్యతో ఉన్న అత్మీయత భావాలను, ఆనందన క్షణాలను బహుముఖ సేవలను, మంచి మనస్సును, సామాజిక స్పూర్తి గురించి విశ్వవ్యాప్తంగా తెలియపరచాలనే సంకల్పంతో, ఆత్మీయుల స్వహస్తాలతో రాసిన " అక్షర ఆణిముత్యాలను " పుస్తకంగా రూపొందిచడం ఈ పుస్తక ప్రత్యేకత.

    Trisha launches digital “Nandamuri Shikaram”

    అత్యంత భారీ స్తాయిలో బాలయ్య శత చిత్రల వేడుకలకు సన్నాహాలు చేస్తున్నట్లు, ఈ వేడుకలో బాలయ్యకు బహుమానంగా 9 అడుగుల వెడల్పు, 4 1/2 అడుగులు ఎత్తు గల సింహాన్ని మల్టి కలర్ గ్రానైట్ తో రూపొందిస్తున్నట్లూ, పుస్తక రూపకర్త అనంతపురం జగన్ తెలియజేసారు.

    నందమూరి శిఖరం పుస్తకానికి సంబదించిన తొలి హృదయ స్పందనను బాలయ్య గారి సహధర్మచారి శ్రీమతి వసుంధర గారు తెలియజేసారు.
    ఈ పుస్తకాన్ని 2016 ఆవిష్కరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిజిటల్ మీడియా ప్రమోషన్స్ ను E3 Media వారు సోంతం చేసుకున్నారు

    అనంతపురము జగన్ మాట్లాడుతూ ‘14 ఏళ్ళ వయస్సులో విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు అన్న యన్.టి.ఆర్. వారసుడిగా తెలుగు చలన చిత్ర సీమకు పరిచయమై క్రమశిక్షణ, పట్టుదల, ప్రతిభతో అంచలంచెలుగా ఎదిగి, తండ్రికి తగ్గ తనయుడుగా అన్ని రకాల పాత్రలు పోషించి 40 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ విశ్వవ్యాప్తంగా నటవారసుడిగా శత చిత్రాలు పూర్తి చేసుకోబోతున్న తొలి తెలుగు అగ్ర కథానాయకుడిగా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్న శుభ సంధర్బంగా మహా మనిషి కోసం తమవంతు బాధ్యతగా ఈ పుస్తక రూపకల్పనకు శ్రీకారం చుట్టాము' అన్నారు.

    Trisha launches digital “Nandamuri Shikaram”

    కళారాధన తోనే జీవన సాఫల్యం అందుకొంటూ రంగం ఏదైనా తన తండ్రి యన్.టి.అర్. అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఆశయాలే లక్ష్యంగా ముందుకు వెళ్తూ అభిమానులు, ప్రేక్షకుల దీవెనలతో బహుముఖ సేవలను అందిస్తూ, ఎంతో సాధించినా - ఇంకా సాధించాల్సింది చాలా ఉందని అను నిత్యం శ్రమిస్తూ అందరితో మమేకం అవుతూ , ఎదిగినకొద్దీ ఒదిగి ఉంటూ, సమాజానికి, సినీ పరిశ్రమకు, తన వంతు బాద్యతగా బహుముఖ సేవలు అందిస్తున్న బాలయ్య గారి అపరూపమైన వ్యక్తిత్వం గురించి సినీ ప్రముఖులు , ఆత్మీయులు, కుటుంబసభ్యులు స్వహస్తాలతో రాసిన 'హృదయ స్పందన ' ను ఆవిష్కరించే అరుదైన ప్రయత్నం చేస్తున్నామని జగన్ తెలిపారు. ఈ నందమూరి శిఖరం పుస్తకం బాలకృష్ణ గారి 'కీర్తి కిరీటం' లో కలికితురాయి కానుంది.

    బాలయ్య నట విశ్వరూపాన్ని, సామాజిక, రాజకీయ రంగాలలో ఆయన అందిస్తున్న ప్రశంసనీయమైన సేవలను తెలుపే ఈ వెయ్యి పేజిల పుస్తకం రూపకల్పన పనులను ఇప్పటికే ప్రారంభిచామని , బాలయ్య శత చిత్ర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించామని అనంతపురము జగన్ తెలిపారు.

    బాలయ్య నట విశ్వరూపాన్ని, సామాజిక, రాజకీయ రంగాలలో ఆయన అందిస్తున్న ప్రశంసనీయమైన సేవలను తెలుపే ఈ వెయ్యి పేజిల పుస్తకం రూపకల్పన పనులను ఇప్పటికే ప్రారంభిచామని , బాలయ్య శత చిత్ర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించామని అనంతపురము జగన్ తెలిపారు.

    ఈ సందర్బంగా నందమూరి బాలకృష్ణ జీవిత సహచరిణి వసుంధర స్వహస్తాలతో రాసిన తన హృదయ స్పందనను పుస్తక రూపకర్త అనంతపురం జగన్ కు అందజేశారు. అనంతపురం జగన్ మాట్లాడుతూ సేవాగుణంలో తనకు బాలయ్యే స్పూర్తి అని, ఆయన ఆశీస్సులతోనే యన్.బి.కే. హెల్పింగ్ హాండ్స్ స్థాపించి, జాతీయ స్థాయిలో సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. 'నందమూరి శిఖరం ' పుస్తక రూపకల్పనకు తనకు అవకాశం కల్పించినందుకు స్పూర్తి ప్రదాత బాలయ్యకు జగన్ ధన్యవాదాలు తెలిపారు.

    English summary
    “Nandamuri Shikaram”Facebook page was launched by none other than heroine Trisha who is now paired with Balayya in “Lion”. As she is present at the shooting of the movie alongside Balayya, fans have requested the actress to launch the FB page, a digital link to the upcoming book.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X