పవన్ కళ్యాణ్ కి పరమ ఎలర్జీ అందుకే త్రిష సైడైపోయింది...
తీన్ మార్ విడుదలకి ముందు పవన్ కళ్యాణ్ అంటే అంతిష్టం, ఇంతిష్టం అంటూ మెలికలు తిరిగిన త్రిష సినిమా విడుదలవగానే ఇక దాని మాట మరిచిపోయింది. తూతూ మంత్రంగా ఒకటి రెండు ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొని చేతులు దులిపేసుకుంది. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నా కానీ సినిమాకి తనవంతు సహకారం అందించడానికి ఇష్టపడడం లేదు.
శక్తి సినిమాకి ఇలియానా కూడా ఇలానే నాన్ కోపరేషన్ తో ఇబ్బంది పెట్టింది అయితే తీన్ మార్ సినిమాకి ఇంకో మైనస్ ఏమిటంటే ఇందులోని హీరో పవన్ కి పబ్లిసిటీ అంటే పరమ ఎలర్జీ. తన సినిమా గురించి మాట్లాడ్డానికి అస్సలు ఇష్టపడని పవన్ ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదు. సినిమా సక్సెస్ లో పబ్లిసిటీ శాతం చాలా పెరిగినా కానీ పవన్ మారలేదు.
అతనికి తోడు త్రిష కూడా లైట్ తీసుకోవడంతో తీన్ మార్ కి సరయిన ప్రమోషన్ జరగడం లేదు. ఆడియో ఫంక్షన్ లో తెగ హడావిడి చేసిని గణేష్ బాబు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యాడు. మొత్తమ్మీద తీన్ మార్ పరిస్థితి తారుమారు కావడానికి పబ్లిసిటీ లోపం కూడా కారణమవుతోంది.


Click it and Unblock the Notifications











