»   » ఇన్నాళ్ళకి ముడి వీడింది... అసలు కారణం చెప్పిన త్రిష

ఇన్నాళ్ళకి ముడి వీడింది... అసలు కారణం చెప్పిన త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా రంగాన్ని మాయా ప్రపంచం అని ఊరికే అనలేదు. ఇది ఎవరిని ఎప్పుడు? ఏ స్థాయిలో కూర్చోపెడుతుందో ఊహించడం కష్టం. ఇక తన పైని అయిపోయింది అనుకున్న వాళ్లు అనూహ్యంగా టాప్ లెవల్‌లో వెలిగిపోతుంటారు.దీనినే సెకెండ్ ఇన్నింగ్స్ అంటుంటారు. నయనతార ప్రస్తుతం ఇలానే దక్షిణాది సినీ పరిశ్రమను దున్నేస్తున్నారు. ఇక ఈ విషయంలో నటి త్రిష ఏమీ తీసిపోలేదు. ఈ మధ్య సరైన హిట్స్ లేకపోవడంతో త్రిష పనైపోయిందనే ప్రచారం జరిగింది.

అయితే త్రిష కెరీర్ మళ్ళీ ఇప్పుడు ఊపందుకుంది. కొడి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటం తో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. వరుణ్ మనియన్ తో పెళ్ళికి సిద్దమవుతున్న సమయంలో రెండు కుటుంబాల మధ్య విభేదాలు రావడంతో వీరి వివాహం ఎంగేజ్మెంట్ తోనే పెటాకులు అయ్యింది. అయితే వీరి పెళ్లి ఎందుకు రద్దు అయ్యిందనే విషయం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

కొంచం వెనుకబడింది:

కొంచం వెనుకబడింది:

అప్పట్లో పెళ్ళి ఎందుకు ఆగిపోయింది అన్న విషయం పై అస్సలు మాట్లాడలేదు త్రిష అసలు ఆ సంగతే జరగలేదన్నట్టు కూడా వ్యవహరించింది. కానీ అప్పటినుండే ఆమెకు అవకశాలు తగ్గటం మొదలయ్యింది. వరుసపరాజయాలూ, కుర్రహీరోల రాకతో వారి పక్కన నటించటానికి తీసుకోక త్రిష కొంచం వెనుకబడింది.

పెళ్లి గురించి చెప్పింది:

పెళ్లి గురించి చెప్పింది:

అయితేనేం ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది. అంతేకాదు తన వివాహం విఫలం ఎందుకయ్యిందో కూడా చెప్పేసింది... కోడి (తెలుగులో ధర్మయోగి) మంచి విజయం సాధించింది. ఆ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రమోషన్‌ కార్యక్రమంలో త్రిష తన పెళ్లి గురించి చెప్పింది.ఇంతకీ త్రిష ఏం చెప్పిందంటే....

రెండు కుటుంబాల మధ్య విభేదాలు:

రెండు కుటుంబాల మధ్య విభేదాలు:

త్రిష కెరీర్ మళ్ళీ ఇప్పుడు ఊపందుకుంది. పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత ఆమెకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తమిళ నిర్మాత వరుణ్ మనియన్ తో పెళ్ళికి సిద్దమవుతున్న సమయంలో రెండు కుటుంబాల మధ్య విభేదాలు రావడంతో వీరి వివాహం ఎంగేజ్మెంట్ తోనే పెటాకులు అయ్యింది. అయితే వీరి పెళ్లి ఎందుకు రద్దు అయ్యిందనే విషయం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

వరుణ్ మనియన్:

వరుణ్ మనియన్:

ఎన్గేజ్మెంట్ తర్వాత పెళ్లి రద్దు చేసుకోవలసిన అవసరం ఏమొచ్చింది అనేది ఎవ్వరికి అంతుపట్టని ప్రశ్నగా ఉన్నది. అయితే ఎట్టకేలకు దీనికి సంబందించిన కొంత సమాచారం ఇప్పుడు కోలీవుడ్ వినిపిస్తుంది. త్రిష సన్నిహితుల సమాచారం ప్రకారం....వివాహం తర్వాత సినిమాల్లో నటించేందుకు ఒప్పుకునేది లేదని వరుణ్ మనియన్ ఫ్యామిలీ త్రిషకు తేల్చి చెప్పారట.

మంచి ఆఫర్ వస్తే:

మంచి ఆఫర్ వస్తే:

తానూ గత పదేళ్లుగా నటిస్తున్నానని , మంచి ఆఫర్ వస్తే సినిమాల్లో నటిస్తానని చెప్పిందట. దీన్ని సీరియస్ గా తీసుకున్న వరుణ్ కుటుంబ పెద్దలు పెళ్లి కాన్సిల్ చేసుకుంటామని హెచ్చరించినా...త్రిష తగ్గకిపోవడంతో ఆ పెళ్లి ఆగిపోయింది. ఇక తానూ ఒంటరిగానే ఉన్నానని, ఈ జీవితం చాలా సంతోషంగా సాగిపోతుందని త్రిష ట్విట్టర్లో పోస్ట్ చేసింది కూడా

దానికి ఒప్పుకోనందుకే:

దానికి ఒప్పుకోనందుకే:

ఇదే సంగతిని ఇప్పుడు స్వయంగా తానే చెప్పింది. ‘నేను నటిగా కొనసాగడానికి ఒప్పుకోనందుకే పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నా. నేను ప్రెగ్నెంట్‌ అయినపుడు కూడా కొన్ని నెలల గ్యాప్‌ మాత్రమే తీసుకుంటా. హీరోయిన్‌ వేషాలు రాకపోతే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానైనా కొనసాగుతాను. దానికి ఒప్పుకోనందుకే ఓ వ్యక్తితో తెగదెంపులు చేసుకున్నా. చనిపోయేవరకు నటిస్తూనే ఉంటా. దీనికి అంగీకరించినవాడితోనే పెళ్లిపీటలు ఎక్కుతాన'ని చెప్పింది.

చనిపోయేంతవరకు:

చనిపోయేంతవరకు:

దక్షిణాది హీరోయిన్లలో అగ్రస్థానం సంపాదించుకున్న త్రిష.. వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం వరకు వెళ్ళింది. ఆపై పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంది. చనిపోయేంతవరకు నటిస్తునూ ఉంటానని.. హీరోయిన్ వేషాలు రాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగానైనా కొనసాగుతూనే ఉంటానని.. ఇందుకు వరుణ్ మణియన్ ఒప్పుకోకపోవడంతోనే ఆ వ్యక్తితో తెగతెంపులు చేసుకున్నట్లు త్రిష

పెళ్ళి చేసుకోవడం ద్వారా:

పెళ్ళి చేసుకోవడం ద్వారా:

టాలీవుడ్, కోలీవుడ్‌లలో నెంబర్ హీరోయిన్‌గా.. దాదాపు దశాబ్ధ కాలం పాటు కొనసాగిన త్రిష.. పెళ్ళి చేసుకోవడం ద్వారా సినీ పరిశ్రమకు దూరమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ త్రిష మాత్రం పెళ్ళిని పక్కనబెట్టి... లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాటు హీరోయిన్ అవకాశాలను కూడా చేసుకుంటూపోతోంది.

బయట పెట్టింది:

బయట పెట్టింది:

అంతే కాదు తన మనసులో ఉన్న ఇంకో కోరికని కూడా బయట పెట్టింది ‘కొడి' సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం బయోగ్రఫీల యుగం నడుస్తోందని,

ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో:

ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో:

బాలీవుడ్ లో పలువురు క్రీడా ప్రముఖుల జీవిత చరిత్రలు సినిమాలుగా వచ్చి, మంచి విజయం సాధిస్తున్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా తనకు ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించాలని ఉందని తెలిపింది. తామిద్దరం ఒకే స్కూల్ (చర్చ్ పార్క్) లో చదువుకున్నామని గుర్తుచేసింది.

జయలలిత జీవిత చరిత్ర:

జయలలిత జీవిత చరిత్ర:

జయలలిత జీవితం స్పూర్తివంతంగా ఉంటుందని, ఆమె పాత్రలో నటించడం ద్వారా ముఖ్యమంత్రిగా కనిపించవచ్చని తెలిపింది. అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోనని త్రిష తెలిపింది. దీంతో తమిళ దర్శకులెవరైనా జయలలిత జీవిత చరిత్రతో సినిమా తీయాలనుకుంటే తనను సంప్రదించవచ్చని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది.

అవకాశాలు కల్పించుకోవడంలో:

అవకాశాలు కల్పించుకోవడంలో:

మొత్తానికి అవకాశాలు కల్పించుకోవడంలో త్రిష మంచి చొరవ చూపిస్తున్నట్టే కనబడుతోంది. అందుకే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లైనా టాప్ హీరోయిన్ గానే చెలామణి అవుతోంది.

English summary
Trisha has finally opened up about the break up with young businessman Varun Manian
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu