»   » హీరోయిన్ త్రిష మాజీ ప్రియుడికి కత్తిపోట్లు!

హీరోయిన్ త్రిష మాజీ ప్రియుడికి కత్తిపోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ త్రిష, చెన్నై బేస్డ్ ఇండస్ట్రియలిస్ట్ వరున్ మణియన్ గతంలో ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. జనవరి 23, 2015న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి రద్దు చేసుకున్నారు.

కాగా... వరుణ్ మణియన్‌కు సంబంధించి ఓ షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. చెన్నైలోని అతడి ఆఫీసు బిల్డింగ్ లోనే అతడు కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ నేరానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Trisha's ex fiance Varun Manian stabbed

ఈ సంఘటన గురించి వరుణ్ లాయర్ ఎన్. పురుషోత్తమ్ వెల్లడిస్తూ.... సాయంత్రం 4 గంటల సమయంలో ఈ సంగటన చోటు చేసుకుందని, వరుణ్ మణియన్‌ను ఇద్దరు వ్యక్తులు పదునైన స్క్రూ డ్రైవర్‌తో పొడిచారని తెలిపారు.

లిఫ్టులో వారితో జరిగిన గొడవ, పెనుగులాటలో వరుణ్ మణియన్ తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడ్డ వారిని వర్కర్స్ బాలమురుగన్, ముత్తుకుమార్ గా గుర్తించారు. వారిని చెన్నైలోని సైదా పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

English summary
Actress Trisha's ex fiance stabbed, Chennai based industrialist Varun Manian was stabbed at his office building. Police have arrested two persons in connection with the crime.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu