For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డోస్ పెంచి మరింత హాట్ గా త్రిష (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : చేతిలో ఆఫర్స్ లేకపోయినా తన ఫోటో షూట్ లతో అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది త్రిష. తెలుగులో దాదాపు 20 చిత్రాలు వరకూ చేసిన ఈ ముద్దుగుమ్మ కి 2012 పెద్దగా కలిసి రాలేదు. ఆమె బాడీగార్డ్,దమ్ము చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యాయి. దాంతో ఖాళీ పడింది. అయితే తాజాగా ఎమ్.ఎస్ రాజు చిత్రం రమ్ లో బుక్కై మళ్లీ వార్తల్లో నిలిచింది.

  స్టాలిన్ చిత్రం ద్వారా మెగాస్టార్ చిరంజీవితో, కింగ్ చిత్రంలో నాగార్జునతో, నమోవెంకటేశ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాలతో విక్టరీ వెకంటేష్, అతడు, సైనికుడు చిత్రాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు, తీన్ మార్ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో, జూ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో, వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు చిత్రాల్లో ప్రభాస్ సరసన, కృష్ణ చిత్రంలో రవితేజ సరసన ఇలా దాదాపు టాప్ హీరోలందరితో నటించింది.

  ఆమె తెలుగులో నటించిన చిత్రాల్లో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కృష్ణ తదితర చిత్రాలు మంచి విజయం సాధించాయి. అయితే త్రిష ఈ మధ్య తెలుగులో నటించిన తీన్ మార్, దమ్ము చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడటం, తమిళంలోనూ పలు చిత్రాలు నిరాశ పరచడంతో త్రిష హవా కాస్త తగ్గింది. తెలుగులో ఆమె ఒక్క చిత్రం కూడా చేయడం లేదు. అయితే తమిళంలో ఆమె నటించిన చిత్రాలు ఇటీవల విజయం సాధించడంతో అక్కడ తన హవా కొనసాగిస్తోంది. తాజాగా విశాల్ సరసన 'వేటాడు వెంటాడు' అనే తమిళ డబ్బింగ్ చిత్రం ద్వారా త్వరలో త్రిష తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం కూడా పెద్దగా ఫలితం ఇవ్వలేదు.

  త్రిష దాదాపు సౌతిండియా టాప్ స్టార్లందరితో నటించింది. ఒకరకంగా ఏలిందనే చెప్పాలి.

  మోడలింగ్ రంగంలో సక్సెస్ అయిన తర్వాత సినిమాల వైపు తన దృష్టి సారించిన హీరోయిన్ త్రిష..... జోడి చిత్రంతో తన సినీ కెరీర్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సిమ్రన్ ఫ్రెండ్‌గా ఓ చిన్న క్యారెక్టర్ చేసిన త్రిష...... వెంటనే అమీర్ సుల్తాన్ దర్శకత్వంలో వచ్చిన ‘మౌనం పేసియాదె' చిత్రంలో సూర్య సరసన హీరోయిన్‌గా చేసే అవకాశం దక్కించుకుంది.

  డిసెంబర్ 13, 2012లో విడుదలైన ‘మౌనం పేసియాదె' చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే సూర్య, త్రిష పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. అలా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన త్రిష అనతి కాలంలోనే సౌతిండియా టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.

  తెలుగులో ఆమె చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, ప్రభాస్ తదితర టాప్ స్టార్లతో నటించింది.

  తన నటనతో పాటు.... గ్లామర్ విషయంలోనూ ఏమాత్రం తగ్గకుండా తోటి హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చింది.

  సౌతిండియా చిత్రాలతో పాటు.... కట్టా మీటా చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ అదీ కలిసి రాలేదు.

  బాలీవుడ్లో త్రిషకు అచ్చి రాక పోవడంతో మళ్లీ సౌత్ సినిమాల బాట పట్టింది.

  త్రిష తాజాగా ఎమ్ ఎస్ రాజు చిత్రం రమ్ లో ..చేస్తోంది. ఆ చిత్రం తిరిగి తన వైభవం తెచ్చిపెడుతుందని భావిస్తోంది.

  రీసెంట్ గా త్రిష వివాదాల్లో సైతం ఇరుక్కుంది. ఓ మీడియా సమావేశంలో త్రిష మాట్లాడుతూ..... ''నేను నటించే చిత్రాల్లో మద్యం తాగే సన్నివేశాలుంటే అవి తప్పకుండా విజయం సాధిస్తాయని నా స్నేహితులు చెప్పారు. అందుకే ప్రతి చిత్రంలో అలాంటివి ఉండాలని దర్శకులను అడుగుతాను. నా తరవాతి చిత్రాల్లోనూ అవకాశం ఉంటే అలాంటి సన్నివేశాల్లో కనిపిస్తాను'' అని తెలిపింది. దాంతో ఆమెపై మహిళా సంఘాలు,హిందూ సంఘాలు మండిపడ్డాయి.

  త్రిష ప్రయాణం కూడా సాఫీగా సాగడం లేదు. గతేడాది వచ్చిన 'దమ్ము' ఆమెకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. 'వెంటాడు వేటాడు' విడుదలైనా ఫలితం లేదు. 'రమ్‌'లోనూ నలుగురులో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. దర్శక నిర్మాతలు త్రిష వైపు దృష్టి సారించాలంటే వీటిలో కనీసం ఓ సినిమా అయినా.. ప్రేక్షకులకు చేరువవ్వాలి.

  English summary
  
 Trisha Krishnan took up acting after having a successful career in modelling. The actress donned the grease paint in Praveen Kanth's Jodi, where she was seen in the role of Simran's friend. But her first movie to release as a lead actress was Ameer Sultan's Mounam Pesiyadhe. The film was released on December 13, 2002. Though the film opened up to mixed reviews, her performance was noticed by critics and audience that paved way for the beginning of a star.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X