»   » ‘తీన్‌ మార్’ మ్యాటర్ ని కవర్ చేస్తూ చెప్పుకొచ్చిన త్రిష

‘తీన్‌ మార్’ మ్యాటర్ ని కవర్ చేస్తూ చెప్పుకొచ్చిన త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

''నటిగా ఓకే.త్రిష అందంగా ఉందని, బాగా చేసిందని రివ్యూలు కూడా వచ్చాయి. ప్రేక్షకులను కూడా నా పాత్ర బాగా ఎంటర్‌టైన్ చేసింది. ఇక అంతకంటే ఏం కావాలి..? నేనైతే ఆ సినిమా విషయంలో సంతృప్తిగానే ఉన్నాను"" అని చెప్పారు. తెలుగులో కొంతగ్యాప్ తర్వాత చేసిన 'తీన్‌మార్" మీకు ఎలాంటి అనుభూతినిచ్చిందని త్రిషను మీడియా వారు అడిగితే ఇలా స్పందించింది.

'తీన్‌మార్"లో త్రిష వేసుకున్న పొట్టిపొట్టి డ్రెస్సులు దాదాపుగా ఆమె అందాల్ని బహిర్గతం చేసేశాయి. ఇక, ఇంకాస్త మోతాదు పెంచాలని త్రిష గనుక డిసైడ్ అయితే, టూ పీస్ బికినీలో కనిపించడమొక్కటే మిగిలి వుంటుంది అందరూ కామెంట్ చేసారు.ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..'నిజమే..తీన్‌మార్ సినిమాలో నా గ్లామర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రేంజ్ రెస్పాన్స్ అస్సలు ఊహించనే లేదు. కథ డిమాండ్ చేసింది కాబట్టే అలా కనిపించాల్సి వచ్చింది అంది.

పవన్ కళ్యాణ్ సరసన చేసిన త్రిష ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.ఈ చిత్రం తర్వాత మళ్ళీ తెలుగులో బిజీ అవుతాననుకుంది. అయితే ఆమెకు వెంకటేష్ సరసన బాడీగార్డ్ రీమేక్ లో మాత్రమే ఆఫర్ వచ్చింది.అది కూడా ఈ చిత్రంలో చేయకపోయినా వచ్చేదనేది నిజం.చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోవటంతో ఆమె నిరాశగా ఉన్నా అది బయిటకు కనపడనీయకుండా ఇలా కవర్ చేస్తూ చెప్పుకొచ్చింది.

English summary
Pawan Kalyan’s latest movie Teen Maar having a thunderous opening at the box office, but failed to sustain as the collections started dropping from fifth day of its release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu