»   » త్రివిక్రమ్ డైరక్షన్: రామ్ చరణ్, ధోణి లతో...

త్రివిక్రమ్ డైరక్షన్: రామ్ చరణ్, ధోణి లతో...

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రామ్ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఎమ్.ఎస్ ధోణి కలిసి తెరపై కనిపించనున్నారు. వీరిద్దరినీ త్రివిక్రమ్ డైరక్ట్ చేయబోతున్నారు. అయితే సినిమాకోసం వీరిద్దరూ కలవటం లేదు. పెప్సీ యాడ్ కోసం ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. రామ్ చరణ్ కి,ధోణి కి ఇది సంవత్సరం పాటు కాంటాక్ట్ ఇది. ధోణి ఆరు కోట్లు, రామ్ చరణ్ నాలుగు కోట్లు తీసుకుంటూంటే, యాడ్ డైరక్ట్ చేసినందుకు త్రివిక్రమ్ 3 కోట్లు తీసుకోబోతున్నారని వినికిడి. డిసెంబర్ లో యాడ్ మన ముందుకు వస్తుంది.

మరో ప్రక్క రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో త్వరలో ఓ మెగా మూవీ రాబోతోంది. విశ్వసనీయంగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. 2010లో త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ పెప్సి యాడ్లో నటించినప్పటి నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నప్పటికీ....ఈ సారి మాత్రం ఈ వార్త నిజం కాబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు రామ్ చరణ్ కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై నిర్మాత,మిగతా సాంకేతిక నిపుణల సమాచారంతో కూడిన పూర్తి ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ ఓకే అయిందని, ప్రస్తుతం ఈ ఇద్దరు కమిటైన సినిమాలు పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఫ్లోర్ మీదకు రానున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్టు వర్కు, డైలాగులు తదితర పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసి విడుదల కోసం ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం పూర్తయిన తర్వాత చరణ్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన 'ఎవడు' విడుదలకు సిద్దంగా ఉంది.

English summary

 Ram Charan and Indian Cricket Team captain M.S.Dhoni are going to appear in an advertisement for Pepsi directed by Telugu movie director Trivikram. This ad will be released in December. This is one year contract ad for Ram Charan and Dhoni. Dhoni take 6 crores , Ram Charan takes 4 crores and Trivikram takes 3 crores for this add.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu