»   » నితిన్ - త్రివిక్రమ్ ‘అ..ఆ’ ప్రారంభోత్సవం (ఫోటో)

నితిన్ - త్రివిక్రమ్ ‘అ..ఆ’ ప్రారంభోత్సవం (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో నితిన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘అ...ఆ' (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం ఉదయం రామానాయుడు స్టూడియోలో జరిగింది. నితిన్, త్రివిక్రమ్, నిర్మాత ఎస్.రాధాకృష్ణ, సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ చిత్రంలో సమంత, అనుపమ పరమేశ్వరన్ (మళయాల చిత్రం ‘ప్రేమమ్' ఫేం) ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 5 నుండి మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

తెలుగు స్టార్ డైరెక్టర్లలో ఒకరైన దర్శకుడు త్రివిక్రమ్ దాదాపు టాప్ పొజిషన్లో ఉన్న హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు మొదటి నుండీ. దర్శకుడిగా తన తొలి సినిమా తరుణ్ హీరోగా ‘నువ్వే నువ్వే' తప్ప మిగతా వన్నీ ఆయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో చేసినవే. ఈ ముగ్గురు హీరోలతో రెండేసి సినిమాలు చేసాడు త్రివిక్రమ్.

Trivikram-Nitin movie 'A...Aa' launched

చాలా కాలం తరువాత త్రివిక్రమ్ రూటు మార్చారు. నితిన్ లాంటి మధ్య స్థాయి హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. సాధారణంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనగానే పెద్ద స్టార్స్, భారీ తారాగణం, దేవిశ్రీ ప్రసాద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు.

కానీ నితిన్ హీరోగా తెరకెక్కించబోయే సినిమాకు కోలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాటోగ్రాపర్లనే తన సినిమాలకు ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాకు సౌతిండియాలోని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ తీరు చూస్తుంటే.... ఈ సారి ఆయన తన గత సినిమాలకు పూర్తి భిన్నమైన, రొటీన్ కు భిన్నమైన సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. మణిరత్నం దగ్గర పని చేసిన సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ఈ మధ్య సినిమాల కంటే డాక్యుమెంటరీలే ఎక్కవగా చేస్తున్నారు. త్రివిక్రమ్ ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నడనే ప్రచారం సాగుతోంది.

English summary
Trivikram Srinivas, after a moderate hit with S/o Satyamurthy, is now working with Nithiin for the first time, for a romantic entertainer titled A...Aa, which has Samantha Prabhu as the female lead.
Please Wait while comments are loading...