For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బయటికొచ్చి చూస్తే...!? డాన్సులే: పవన్-త్రివిక్రమ్ పాట అద్దిరి పోయింది

  |
  PSPK

  పవన్ కల్యాణ్ 25 వ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. జల్సా అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న చిత్రంపై ప్రేక్షకులతోపాటు పవన్ అభిమానులకు భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ అనిరుధ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ బిట్ వీడియో హీరోయిన్ కీర్తి సురేశ్ -పవన్ ల లుక్స్ ...ఈ సినిమా పై అంచనాలను మరింత పెంచాయి.

  అజ్ఞాత వాసి

  అజ్ఞాత వాసి

  సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10, 2018న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నుండ‌గా, ఈ మూవీకి టైటిల్ ఏంటి అనే దానిపై మాత్రం ఇప్ప‌టికి క్లారిటీ లేదు. అజ్ఞాత వాసి, రాజు వ‌చ్చినాడో, ఇంజ‌నీర్ బాబు అంటూ ప‌లు టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్న‌ప్ప‌టికి వీటిపై క్లారిటీ లేదు. పవన్‌కల్యాణ్ చిత్రంలో ఓ ఐటీ నిపుణుడి పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ ఇందులో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

  స‌డెన్ స‌ర్‌ప్రైజ్

  స‌డెన్ స‌ర్‌ప్రైజ్

  దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ విడుదల చేస్తారని అభిమానులు ఆశించి భంగపడ్డారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ , మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ప‌వన్ 25వ చిత్రం , ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్రానికి సంబంధించి కాన్సెప్ట్ పోస్ట‌ర్‌తో పాటు మ్యూజిక‌ల్ వీడియోని విడుద‌ల చేసి స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

  అనిరుధ్ ర‌విచంద్ర‌న్

  అనిరుధ్ ర‌విచంద్ర‌న్

  ఇందులో చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ "బైటికొచ్చి చూస్తే....." అనే పాట‌ని పాడుతుండ‌గా, ఆ పాట‌ని త్రివిక్ర‌మ్ ఎంజాయ్ చేస్తున్నవీడియో., ఆ వీడియో చివ‌రిలో ప‌వన్‌ని డార్క్ షేడ్ లో చూపించి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది చిత్ర బృందం.

  త్రివిక్ర‌మ్ బ‌ర్త్‌డే సందర్భంగా

  త్రివిక్ర‌మ్ బ‌ర్త్‌డే సందర్భంగా

  అయితే ప‌వ‌న్ బ‌ర్త్‌డేకి కొద్ది సాంగ్ మాత్ర‌మే విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ త్రివిక్ర‌మ్ బ‌ర్త్‌డే సందర్భంగా పాటమొత్తం విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది, కొద్దిసేపటి క్రితమే ఆ మాట నిలబెట్టుకున్నారు కూడా, ఇంకా ఊరిస్తే బావుండదనుకున్నారేమో ఈ సారికి నిజంగా పేద్ద సర్ప్రైజే ఇస్తున్నారు.

   బయటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్

  బయటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్

  బయటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఓ క్లాక్... అనే పాట అనిరుధ్ స్వరం లోనే ఉండి చక్కటి టెంపోతో ఆకట్టుకొని హీరో కోసం హీరోయిన్ లేదా, హీరోయిన్ కోసం హీరో పాడుకునే స్టైల్లో ఉంది, (జల్సా లో... మై హార్ట్ ఈజ్ బీటింగ్ లాగా).. అనిరుధ్ మొత్తం మ్యూజిక్ ఎలా చేసాడన్నది ఈ ఒక్క బిట్ తో చెప్పేయొచ్చు.

   వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ బీట్

  వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ బీట్

  వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ బీట్, యూత్ కి కనెక్టయ్యే లవ్ ఫీల్ ఉన్న లిరిక్స్ కలిసి ఈ పాటని ఎక్కడికో తీస్కెళ్ళాయి. యూత్ లో దూసుకుపోయే స్థాయిలోనే ఈ యంగ్స్టర్ ఇచ్చిన ట్యూన్స్ ఉన్నాయని సమాచారం... ఈ లెక్కన మనోడు ఈ సారి పవన్ ఇచ్చే బ్లాస్ట్ కి ఇంకాస్త బూస్ట్ కలిపినట్టే.

  ఓయ్ నీ చేతికున్న బ్యాంగిల్సే..

  బైటికొచ్చి చూస్తే టైమ్ ఏమో 3 ఓ క్లాక్

  ఇంటికెళ్లే 12b రూట్ మొత్తం రోడ్డు బ్లాక్

  ఓయ్ నీ చేతికున్న బ్యాంగిల్సే.. తాళమేసే నా శ్యాండిల్సే
  వాక్ వే లో చూస్తే పువ్వుల రెక్కలు ఫుల్లుగా కప్పేసే
  కార్నర్ లో కాఫీ షాప్.. వేడివేడిగా విజిలేసే.. బస్ కిటికీ దగ్గర కాలేజ్ స్టూడెంట్ ఫోన్ లో మోగే..
  ఎఫ్.ఎంలో ఎవరో పాడితే ఒళ్ళంతా ఎందుకో ఊగెనే..
  ఆపిల్ పండులా సూరీడే.. ఏరోప్లేనులా నా గుండె తేలిందే గాలిలో మబ్బులా.. జారిందే నేలపై నీడలా.. ముళ్లే గుచ్చెనే సడన్ గా.. చల్లగాలే విలన్ లా సాగిపోయే టూన్లో ఒదిగిపోయిన సాహిత్యం కూడా అద్బుతం అనేలా ఉంది...

  English summary
  Pawan kalyan trivikram Kambo Movie PSPK #25 asper the sources Agnathavasi Movie Song Released now, a Surprize to PK fans on Trivikram Birth day
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X