For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లెక్కలేనంత సంపాదించినా.. 5 వేల అద్దె ఇంట్లోనే.. త్రివిక్రమ్ సెంటిమెంట్ ఇదే..

  By Rajababu
  |

  సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుందనే విషయం కొత్తగా చెప్పేది కాదు. కథలు రాయడం, షూటింగ్ ఆరంభించడం, సినిమాల రిలీజ్ చేయడం లాంటి అంశాలకు ముహుర్తాలు, ప్రదేశాలు, ప్రాంతాలను ఎంచుకోవడమనే ఎక్కువగా ఉంటుంది. ఆచారాలను, సంప్రదాయలను పాటిస్తుంటారు. ఎంత డబ్బు ఉన్నా.. లో ప్రొఫైల్‌ మెయింటెన్ చేసే పద్దతి ప్రముఖుల్లో కనిపిస్తుంటుంది. ఇలాంటి వాటికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మినహాయింపు కాదు. మాటలతో అదరగొట్టే త్రివిక్రమ్ సెంటిమెంట్ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే..

   భీమవరం టూ హైదరాబాద్

  భీమవరం టూ హైదరాబాద్

  సినీ మాయలో పడి ఎలాగైనా పరిశ్రమలో రాణించాలనే బలమైన సంకల్పంతో హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌కు చేరుకునే వారి మాదిరిగానే త్రివిక్రమ్ భీమవరం నుంచి వచ్చాడు. తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల కోసం చాలా కష్టపడే సమయంలో పంజగుట్టలోని సాయిబాబా ఆలయానికి సమీపంలో ఓ చిన్న గదిలో అద్దెకు ఉండేవాడు.

   సునీల్, దశరథ్‌తో కలిసి

  సునీల్, దశరథ్‌తో కలిసి

  హీరో సునీల్, దర్శకుడు దశరథ్‌తో కలిసి ఉండేవాడు. అక్కడి ఉంటూ పరిశ్రమ పెద్దలను, రచయితలను, నిర్మాతలను కలిసేవాడు. తన మిత్రులతో కలిసి కథా చర్చలు పంజగుట్టలోని తన నివాసంలోనే జరిపేవాడు.

  అజ్ఞాతవాసిలో మరో అజ్ఞాతవాసి.. ఊహించని గెటప్‌లో టాప్ హీరో !
   పంజగుట్ట అద్దె గదిలోనే

  పంజగుట్ట అద్దె గదిలోనే

  పంజగుట్టలోని చిన్న గదిలోనే ఉంటూ అనేక కథలకు ప్రాణం పోశాడు. తెర మీదే పేలే మాటల తూటలకు అక్కడే మసాలా దట్టించాడు. ఆ గదిలో స్వయంవరం, సముద్రం, నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలకు మాటలు అక్కడే పుట్టాయి.

  ఆ ఇంటి నుంచే నువ్వే నువ్వే

  ఆ ఇంటి నుంచే నువ్వే నువ్వే

  నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారడానికి ఆ ఇల్లే త్రివిక్రమ్‌కు కలిసివచ్చిందని చెప్పుకొంటారు. అలా దశరథ్ చిత్రం సంతోషంకు మాటలు రాసే అవకాశం వచ్చింది. సంతోషం సమయంలోనే ఏర్పడిన పరిచయం మన్మథుడు లాంటి సినిమాను తీయడానికి అవకాశం దక్కింది.

   నాగార్జునతో మన్మథుడు

  నాగార్జునతో మన్మథుడు

  నాగార్జునతో మన్మథుడు తర్వాత త్రివిక్రమ్ కెరీర్ రాకెట్‌లా దూసుకెళ్లింది. జై చిరంజీవ, అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్‌లో ఎదురులేని డైరెక్టర్‌గా త్రివిక్రమ్ పేరు తెచ్చుకొన్నారు.

  త్రివిక్రమ్ సొంతింటి కల

  త్రివిక్రమ్ సొంతింటి కల

  టాలీవుడ్‌లో ఉన్నతస్థాయికి చేరుకొని విలాసవంతమైన సొంతింటి కల సాకారమైన పంజగుట్టలోని ఇంటిని మాత్రం వదులుకోలేదు. ఇప్పటికి రూ. 5వేలకు పైగానే అద్దె చెల్లిస్తూ ఆ ఇంటిని తన వద్దే ఉంచుకొన్నాడు. కెరీర్ ఆరంభంలో పడిన కష్టసుఖాలు, మధురానుభూతులను ఇప్పటికి అక్కడి వెళ్లి నెమరువేసుకొంటారని త్రివిక్రమ్ సన్నిహితులు చెబుతుంటారు.

  ఇప్పటికీ పంజగుట్టలో

  ఇప్పటికీ పంజగుట్టలో

  అప్పుడప్పుడు సినిమాలకు కథ, మాటలు రాసే పనికి పంజగుట్ట నివాసాన్ని వేదికగా చేసుకొంటారట. ఆ గదిలోనే సినిమా కథలకు పురుడు పోస్తాడట. ఎంతపైకి ఎదిగినా తమ ఇష్టమైన వాటిని వదులుకోరనే ఉదాహరణకు త్రివిక్రమ్ చూపించవచ్చు.

   పవన్‌ కల్యాణ్‌తో అజ్ఞాతవాసి

  పవన్‌ కల్యాణ్‌తో అజ్ఞాతవాసి

  తెలుగు సినిమా పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగి అగ్ర దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో అజ్ఞాతవాసి చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రీలీజ్ కానున్నది.

  English summary
  Trivikram Srinivas is the one the best directors in the Tollywood. He came from Bhimavaram to Hyderabad to pursue the film career. In intial stage of his filmy days he lives in Panjagutta of Hyderabad. Even he become the Ace director, He pays rent for the Punjagutta house and kept with him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X