»   » షాకింగ్ ఫోటో పోస్టు చేసిన హీరో అక్షయ్ కుమార్ భార్య....

షాకింగ్ ఫోటో పోస్టు చేసిన హీరో అక్షయ్ కుమార్ భార్య....

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా పోస్టు చేసిన ఓ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ముంబైలోని జుహు బీచ్‌లో ఓ వ్యక్తి మలవిసర్జన చేస్తున్న సమయంలో అతడు కనిపించేలా సెల్ఫీ తీసి ఆమె తన ట్విట్టర్లో పోస్టు చేశారు.

తన భర్త నటించబోయే 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా' పార్ట్ 2 కు సంబంధించిన ఫస్ట్ సీన్ ఇదే అంటూ ఆమె ఈ ఫోటోకు కామెంట్ చేయడం గమనార్హం. బహిరంగ మల విసర్జన మానుకోవాలని ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేస్తున్నా, తన భర్త లాంటి వారు ఈ అంశంపై సినిమాలు తీస్తున్నా.... ఇంకా కొందరిలో మార్పు రావడం లేదనే ఆవేదనతో ఆమె ఈ ఫోస్టు చేసినట్లు స్పష్టం అవుతోంది.

మార్పు రావాల్సిన అవసరం ఉంది

మార్పు రావాల్సిన అవసరం ఉంది

ట్వింకిల్ ఖన్నా పెట్టిన పోస్టుపై ఓ ప్రముఖ జర్నలిస్టు స్పందిస్తూ... ప్రజలు ఈ విషయంలో ఇంకా మారాలి. వారికి అర్జంట్ అయితే దగ్గరలో ఉండే టాయిలెట్‌కు వెళ్లొచ్చు అని కామెంట్ చేశారు. దీనికి ట్వింకిల్ రిప్లై ఇస్తూ.... నిజమే, ఈ స్పాట్ నుండి ఏడెనిమిది నిమిషాలు నడిస్తే పబ్లిక్ టాయిలెట్ వస్తుంది. కానీ కొందరు ఇలా బహిరంగ ప్రదేశాల్లో తమ పనులు కానిస్తున్నారు అంటూ పేర్కొన్నారు.

Akshay Kumar Padman First Look
టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా

టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా

అక్షయ్ కుమార్ హీరోగా ఇటీవల ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. బహిరంగ మల, మూత్ర విసర్జన మానుకోవాలని, ప్రతి ఒక్కరూ టాయిలెట్ వాడాలి అనే సందేశంతో ఈ సినిమా తెరకెక్కించారు.

రూ. 100 కోట్లు

రూ. 100 కోట్లు

అక్షయ్ కుమార్ నటించిన ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా' చిత్రం 8 రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేసింది. అక్షయ్ కుమార్ కెరీర్లో 8వ వంద కోట్లు వసూలు చేసిన సినిమా ఇది. సల్మాన్ ఖాన్ 11 వంద కోట్ల సినిమాలతో మొదటి స్థానంలో ఉండగా, 8 వంద కోట్ల సినిమాలతో అక్షయ్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు.

సీక్వెల్ వస్తుందా?

సీక్వెల్ వస్తుందా?

ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చూస్తుంటే జనాల్లో అవేర్‌నెస్ ఇంకా తేవాల్సిన అవసరం ఉందని, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా చిత్రానికి సీక్వెల్ తీయాల్సిందే అని భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. మరి అది ఏ మేరకు నిజం అవుతుందో చూడాలి.

English summary
The other day, Akshay's wife Twinkle Khanna had spotted a Man defecating openly on Juhu Beach when she had gone for a morning walk. Sharing the picture on her Instagram page, The former Actress wrote: 'Good morning and I guess here is the first scene of Toilet Ek Prem Katha part 2 #WhenYourWalkGoesDownTheToilet'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu