For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టిక్ టాక్ స్టార్ సోనిక మరణంలో ట్విస్ట్.. వెలుగులోకి కొత్త కోణాలు, అనుమానాలు!

|

సోషల్ మీడియా యాప్ టిక్ టాక్‌లో తన టాలెంట్‌తో లక్షలాది మంది నెటిజన్లను ఆకట్టుకొంటున్న సోనికా కేతావత్ అనూహ్యంగా మృత్యువాత పడటం సంచలనం రేపింది. ఆమె మరణంతో సంగీత ప్రియులు, టిక్ టాక్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోనికా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మరణం వెనుక అనే విషయాలు షాకింగ్ కలిగించే విదంగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకు సోనికా ఎవరు? ఆమెకు ఎందుకింత క్రేజ్.. ఆమె మరణం విషయంలో ఏం జరిగింది? అనే వివరాల్లోకి..

Tik Tok Star Sonika Kethavath Died After Bike Accident
టిక్ టాక్ ప్రపంచంలో ధృవతార

టిక్ టాక్ ప్రపంచంలో ధృవతార

టిక్ టాక్ ప్రపంచంలో సంచలన రీతిలో దూసుకొచ్చిన యువ ప్రతిభావంతురాలు సోనికా కేతావత్. ఆమె డంబ్ స్మాష్, పాటలు, ప్రైవేట్ సాంగ్స్‌, షార్ట్ ఫిల్మ్స్‌తో అనతికాలంలోనే లక్షలాది మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకొన్నది. చిరునవ్వులు చిందిస్తూ అనూహ్యంగా రాణిస్తున్న సోనికా రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండటంతో క్షేమంగా తిరిగి వస్తారని అందరూ ఆశించారు. కానీ సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచిందనే వార్త విషాదంలోకి నెట్టింది. ఆమె ఇక లేరనే వార్త సోషల్ మీడియాను కుదిపేసింది.

నల్గొండ సమీపంలో

నల్గొండ సమీపంలో

నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్రపాటి టోల్ గేటు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో తన సహచర టిక్ టాక్ స్టార్ రఫీ కూడా ఉన్నాడు. వారిద్దరూ కలిసి మరికొంత మంది స్నేహితులతో బైక్ రైడింగ్ వెళ్లారు. అప్పుడే ఈ యాక్సిడెంట్ చోటుచేసుకొన్నది. అయితే ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు లేస్తున్నాయి. బైక్ రైడింగ్ సమయంలో సెల్ఫీలు తీసుకోవడం వల్లే ప్రమాదం సంభవించిందనే వార్త మీడియాలో వైరల్ అవుతున్నది.

స్నేహితులు దాచడానికి కారణం

స్నేహితులు దాచడానికి కారణం

టిక్ టాక్ స్టార్ రఫీతోపాటు రోడ్డు ప్రమాదాన్ని తేలికగా కొట్టేశారు. సోనికకు ఏమి కాలేదని, చిన్నపాటి గాయలయ్యాయని చెప్పుకొచ్చినట్టు సమాచారం. క్షేమంగా వస్తుందనుకొన్న సోనికా తిరిగి రాని లోకాలకు వెళ్లడంపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. తోటి స్నేహితురాలు ఆస్పత్రిలో ఉంటే చెప్పకుండా సంఘటనను దాచిపెట్టడం అనేక అనుమానాలకు దారి తీస్తుందని స్థానికులు వెల్లడిస్తున్నారు.

ప్రాణం తీసిన సరదా.. తెలుగు టిక్ టాక్ స్టార్ సోనిక కన్నుమూత!

రఫీ తలకు గాయంపై అనుమానం

రఫీ తలకు గాయంపై అనుమానం

సోనికా మరణం విషయంలో రఫీపై మరో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రఫీ తలకు గాయమైందని, తలకు సర్జరీ కూడా జరిగిందని చెబుతున్నారు. కానీ ఇటీవల రఫీ ఫోటోలు, వీడియోలు చూస్తే తలకు

ఎలాంటి గాయం అయినట్టు కనిపించలేదు. తలకు గాయమైనట్టు ఎందుకు చెప్పారనేది ఇప్పుడు తాజా చర్చ జరుగుతున్నది.

సోషల్ మీడియాలో వీడియోలు

సోనిక, రఫీలు బైక్‌పై వెళ్తున్న చివరి వీడియో సోషల్ మీడియాలో వెలుగు చూసింది. ఇదే సోనిక చివరి వీడియో.. సోనిక అంతిమ క్షణాలు అంటూ ట్యాగ్ చేస్తూ వీడియోలను పోస్టు చేశారు. అయితే ప్రమాదం వెనుక అసలు కారణం చెప్పకుండా స్నేహితులు మోసం చేశారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నది.

సోనిక మరణంపై అనే సందేహాలు

సోనిక మరణంపై అనే సందేహాలు

ఎంతో భవిష్యత్ ఉన్న సోనిక మరణం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది. ఆమె టిక్ టిక్ వీడియోలను షేర్ చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. అయితే సోనికది రోడ్డు ప్రమాదంలో సంభవించిన మరణమా? లేక ఏదైనా మరో విషయం దాగుందా అనే అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.

English summary
Tik Tok Star Sonika kethavath Death After Bike Accident. The road accident occurred near the Ketrapalli Mandalam Korrapati toll gate in Nalgonda district. The accident occurred when a speeding bike collided with a bicycle.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more