»   » నటిపై యాసిడ్ దాడి చేసిన దర్శకుడు, ప్రేమ వ్యవహారమా?

నటిపై యాసిడ్ దాడి చేసిన దర్శకుడు, ప్రేమ వ్యవహారమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేమ వ్యవహారాల్లో యాసిడ్ దాడులు జరుగుతుండటం ఈ మధ్య కాలంలో దేశంలో ఎక్కువయ్యాయి. తాజాగా ఇలాంటి కారణంతోనే మరో దాడి జరిగింది. అయితే ఈ సారి ఈ సంఘటన సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఉండటం గమనార్హం. దాడిచేసిన వ్యక్తి ఓ దర్శకుడు, దాడి జరిగింది ఓ నటిపై. ఈ దాడికి మూల కారణం ప్రేమ వ్యవహారమే అని తెలుస్తోంది.

భోజ్ పురి సినిమా పరిశ్రమలో రూపాలి (20), వికాస్ (19) అనే ఇద్దరూ సినిమా షూటింగ్ కోసం వచ్చి ఓ కాలేజి ప్రాంగణంలో నిద్రపోతుండగా అజయ్ కుమార్ అనే సినీ దర్శకుడు వచ్చి వాళ్ల మీద యాసిడ్ పోసి అక్కడి నుంచి పారిపోయాడు. తాను వద్దన్నా వినకుండా వికాస్ తో కలిసి నటిస్తున్నందునే అజయ్ ఈ దాడికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. ఉత్తరప్రదేశ్ లోని బలియా పట్టణం సమీపంలోని నారాయణ్ పూర్ విలేజ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Two Bhojpuri film actors injured in acid attack

ఏఎస్పీ కేసీ గోస్వామి మాట్లాడుతూ నిందితుడు అజయ్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. దాడి జరిగిన వెంటనే వాళ్లిద్దరినీ వెంటనే సమీపంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడి నుంచి వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి పంపారు. ఇద్దరిలో రూపాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Ballia: Two actors of Bhojpuri films were seriously injured in an acid attack in Narayanpur village here, police said today.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu