»   » ఆ ఆశతోనే ఉదయ్ కిరణ్ అలా..., లీక్ చేసిన దర్శకుడు!

ఆ ఆశతోనే ఉదయ్ కిరణ్ అలా..., లీక్ చేసిన దర్శకుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ హీరో ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆయన గురించి పలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు లీక్ అవుతున్నాయి. ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు లేక పోవడం అనే వాదనలో నిజం లేదని, ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చినా.....వాటిని తన చేజేతులారా దూరం చేసుకున్నాడని స్పష్టమవుతోంది.

'చిత్రం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్, ఆ తర్వాత 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' లాంటి వరుస విజయాలతో హాట్రిక్ విజయం సాధించాడు. దీంతో ఆయనకు లవర్ బాయ్ హీరో అనే ముద్ర పడిపోయింది. ఆ తర్వాత ఆయన వద్దకు ప్రేమ కథలతో కూడిన సినిమాలే రావడం మొదలైంది. ఈ క్రమంలో కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి.

దీంతో ఆలోచనలో పడ్డ ఉదయ్ కిరణ్....తాను లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయట పడాలనే ఆలోచనకు వచ్చాడు. మాస్ అండ్ యాక్షన్, ఇతర డిఫరెంటు సినిమాలు కూడా తాను చేయగలను అనే గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉనికి కాపాడు కోవాలన్నా, టాప్ రేంజికి ఎదగాలన్నా మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే ఉత్తమ మార్గమనే ఆలోచనుకు వచ్చాడని తెలుస్తోంది. అందుకే ఆయన మామూలు ప్రేమకథా చిత్రాలను తిరస్కరించడం మొదలు పెట్టాడు.

ఇటీవల ఓ దర్శకుడు ఉదయ్ కిరణ్‌తో ఓ ప్రేమ కథా చిత్రం సినిమా చేయడానికి ప్రయత్నించి విఫలమైన విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చాడు. అతనితో జరిపిన ఫోన్ సంభాషణను మీడియాకు లీక్ చేసాడు. అందుకు సంబంధించిన వివరాలు..

ఉదయ్ కిరణ్: ఇంకా ఎక్కడ లవర్ బాయ్ అండీ

దర్శకుడు : లేదు సార్, ఉందండీ ఇంకా

ఉదయ్ కిరణ్ : కేవలం యాక్షన్ సినిమాలో, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో చెయ్యాలనో నేను ఇలా మాట్లాడటం లేదు, కొంచెం డిఫరెంటుగా సినిమా అయినా నేను రెడీ. నేను చేసిన సినిమాల్లో కంటే ఇపుడు నేను చేసే క్యారెక్టర్లో చాలా వేరియేషన్ ఉండాలి. ఇపుడు ఇలాంటి రొమాంటిక్ క్యారెక్టర్లు చేయడం లేదండీ నేను. నాకు కూడా కెరీర్ పరంగా ఎదుగుదల ఉండాలి కదా, క్యారెక్టర్ పరంగా కూడా ఎదుగుదల ఉండాలి కదా. 13 ఏళ్ల క్రితం చేసిన మనసంతా నువ్వే చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే కష్టం కదండీ. తమిళ్, హిందీల్లో చాలా వేరియేషన్స్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. మనం మాత్రం ఇంకా లవ్ స్టోరీలు, యాక్షన్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలేనా?.... అంటూ ఆ దర్శకుడి ప్రతిపాదనను తిరస్కరించాడు.

తిరస్కరణ అనంతం దర్శకుడితో ఉదయ్ కిరణ్: మీ ప్రాజెక్టుకు బెస్ట్ విషెస్, మీరు తీసే సినిమా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇటీవల పోలీసులుతో చెప్పిన విషయాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉదయ్ కిరణ్ ఎంతసేపూ తాను స్టార్ హీరోనన్న చట్రంలో బిగుసుకుపోయాడని, దాన్నుంచి బయటకు రాలేక తరచూ సతమతమవుతుండేవాడని, ఎన్నిసార్లు ఆయనకు నచ్చజెప్పినా లాభం లేకపోయిందని విషిత ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.'

English summary
Uday Kiran conversation with a Director phone tapes leaked. On the other hand Uday Kiran's wife Vishitha said that her husband was not able come out of his feeling about cinema chances.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu