»   » ఉదయ్ కిరణ్ ‘దిల్ కబడ్డీ’ రిలీజ్ డేట్

ఉదయ్ కిరణ్ ‘దిల్ కబడ్డీ’ రిలీజ్ డేట్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఉదయ్‌ కిరణ్, జాస్మిన్ జంటగా నెక్కంటి ఆంజనేయస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీ దర్శకత్వంలో వి.శివకుమార్ నిర్మించిన చిత్రం 'దిల్ కబడ్డీ'. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 5న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  ఇటీవల ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించిన నేపథ్యంలో.....ఈ చిత్రం విడుదల సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఉదయ్ కిరణ్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ సినిమా చూసేందుకు పలువురు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. సినిమా విడుదల అవుతుందన్న విషయాన్ని సోషల్ నెట్వర్కింగులో షేర్ చేసుకుంటున్నారు.

  Uday Kiran's Dil Kabaddi release date

  ప్రేమ పయనంలో మనసులు ఆడే దోబూచులాట ఎలా ఉంటుందనే అంశంతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.'దిల్ కబడ్డీ' చిత్రానికి కెమెరా: ఎస్.రాజశేఖర్, పాటలు: భాస్కరభట్ల, ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం: సునీల్ కాశ్యప్, మాటలు: కేశవ్ పి. నిర్మాత: వి.శివకుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ.

  ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన వివారల్లోకి వెళితే....ఈ నెల 5న రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో......ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. తాను ఆశించినట్లు తన సినిమా కెరీర్ సాగక పోవడంతో మానసిక సంఘటర్షణకు లోనైన ఉదయ్ ఈచర్యకు పాల్పడ్డట్లు పోలసుల ప్రాథమిక విచారణలో తేలింది.

  English summary
  Uday Kiran’s film Dil Kabaddi is generating lot of buzz suddenly now. The film is slated for release on February 5th and many youngsters are sharing the film’s poster on Facebook and are vowing to view this film as a tribute for this talented actor.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more