»   »  థియేటర్లోకి.... ఉదయ్ కిరణ్ చివరి జ్ఞాపకం

థియేటర్లోకి.... ఉదయ్ కిరణ్ చివరి జ్ఞాపకం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'. 'నువ్వునేను' ఫేమ్ అనిత ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో డింపుల్, గరిమ, మదాలస శర్మ ఇతర పాత్రల్లో నటించారు. మున్నా చిత్ర నిర్మాత. మోహన్ ఏయల్లార్కే దర్శకుడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 Uday Kiran’s last film released on 26th June

ఉదయ్ కిరణ్ నటించిన ఈ చివరి చిత్రం.... రెండు సంవత్సరాలుగా వివిధ కారణాలతో విడుదలకు నోచుకోలేదు. ఉదయ్ కిరణ్ తొలి జయంతి రోజే ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు కానీ అప్పట్లో వీలు కాలేదు. తాజాగా జూన్ 26న ఉదయ్ కిరణ్ 2వ జయంతి సందర్భంగా ఆయన చివరి జ్ఞాపకం అయిన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...ఈ సినిమాకు ఉదయ్ కిరణ్, మున్నా, స్క్రిప్ట్ రైటర్ నరేష్ చాలా కష్టపడ్డారు. ఈ సినిమాను పెద్ద హిట్ చేసి ఉదయ్ కిరణ్‌కి నివాళి ఇవ్వాలనుకుంటున్నాం అన్నారు. సినిమా హిట్టై ఉదయ్ కిరణ్ కి మంచి పేరు తీసుకొచ్చి ఉండేది. తను మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నాకు. ఈ చిత్రానికి మున్నాకాశీ మంచి సంగీతం అందించారు.

English summary
Uday Kiran’s last film Chitram Cheppina Katha now getting released on 26th June, Uday’s 2nd birth anniversary.
Please Wait while comments are loading...