twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉదయ్‌కిరణ్ 'జై శ్రీరామ్‌' స్టోరీ లైన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఉదయ్ కిరణ్ సెకండ్ ఇన్నింగ్స్ తరహాలో మొదలెట్టి చేస్తున్న చిత్రం 'జై శ్రీరామ్‌'. రేష్మ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి బాలాజీ ఎన్‌.సాయి దర్శకత్వం వహిస్తున్నారు. తేళ్ల రమేష్‌, ఎన్‌.సి.హెచ్‌.రాజేష్‌ నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా మీడియాని కలిసిన దర్శకుడు మాట్లాడుతూ ''ప్రాణాల్నిపణంగా పెట్త్టెనా అనుకొన్నది సాధించే పోలీసు అధికారి పాత్రలో ఉదయ్‌కిరణ్‌ ఒదిగిపోయారు. యాక్షన్‌, వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యముంది''అన్నారు.

    ఇక ఈ చిత్రం స్టోరీ గురించి హీరో ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ...ఎక్కడ అన్యాయం జరుగుతోందంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు శ్రీరామ్‌. నేరస్తుల పాలిట సింహ స్వప్నం. అవసరమనుకొంటే నియమ నిబంధనల్ని పక్కనపెడతాడు. వృత్తి తప్ప మరో వ్యాపకం తెలియని ఆ అధికారి జీవితంలోకి ఓ యువతి వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరు? ఆ తరవాత శ్రీరామ్‌కి వృత్తిపరంగా ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? లాంటి విషయాల్ని తెరపైనే చూడాలంటున్నారు.

    అలాగే ''ఇప్పటివరకూ వచ్చిన పోలీస్ కథలకు పూర్తి భిన్నంగా 'జై శ్రీరామ్' ఉంటుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి ప్రధానబలం. లవ్, యాక్షన్, సెంటిమెంట్... ఇలా అన్ని ఎలిమెంట్లూ ఇందులో ఉంటాయి. పతాక సన్నివేశాల్లో నా లుక్ చాలా సర్‌ప్రైజింగ్ ఉంటుంది. సింహా, దూకుడు, ఈగ చిత్రాల్లో నటించిన ఆదిత్య మీనన్ ఇందులో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. విలన్ తండ్రిగా ఓ ప్రముఖ నటుణ్ణి సర్‌ప్రైజింగ్‌గా పరిచయం చేస్తున్నాం'' అని ఉదయ్‌కిరణ్ చెప్పారు.

    నిర్మాత తేళ్ల రమేష్ మాట్లాడుతూ....నాలుగు గెటప్స్‌లో ఉదయ్‌కిరణ్ ఈ చిత్రంలో ప్రేక్షకులను అలరిస్తాడని, బాధ్యతగల పోలీస్ అధికారిగా, కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తిగా అతని పాత్ర చిత్రంలో సరికొత్తగా ఉంటుందని, తప్పక విజయవంతమవుతుందన్న నమ్మకం వుందని తెలిపారు. వంద శాతం ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చే చిత్రంగా రూపొందిస్తున్నామని రేష్మ, ఉదయ్‌కిరణ్ జంటకు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. చలపతిరావు, ఆదిత్యమీనన్‌, ఎమ్మెస్‌ నారాయణ, బెనర్జీ, అలీ, గౌతంరాజు, ప్రభాకర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: డాకే.

    English summary
    
 Jai Sriram, directed by Balaji, is a different story. You will see the chocolate boy metamorphosing into a powerful cop's role, sporting not one but four get-ups in total. Producer Talla Ramesh is confident that the film will be a big hit. "I was thrilled when Balaji told me the story," Uday Kiran says.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X