twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ ఉదయభాను కేసు... ఫోరెన్సిక్ ల్యాబ్‌కు..

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''మధుమతి' సినిమా కోసం నా ఫొటోల్ని మార్ఫింగ్‌ చేశారు. దీంతోపాటు కొన్ని వెబ్‌సైట్లు, పత్రికలు అసభ్యమైన కథనాల్ని ప్రచురించాయి. అందులో నా అభిప్రాయాన్ని కూడా పొందుపరచలేదు'' అంటూ ఉదయభాను ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తాను నటించిన సన్నివేశాలను మార్ఫింగ్ చేశారంటూ ఉదయభాను చేసిన ఫిర్యాదు విషయంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకోనున్నారు.

    ఉదయభాను తన ఫిర్యాదుతోపాటు కొన్ని ఆధారాలను సైతం సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. ఈ ఫోటోలు నిజంగా మార్ఫింగ్ చేసినవా, కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక దర్యాప్తులో కీలకం కానుంది. ఉదయభాను ఫిర్యాదు ఆధారంగా సదరు వెబ్‌సైట్‌పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మధుమతి సినిమా విషయంలో దర్శకుడు రాజ్‌శ్రీధర్ తనని మోసం చేశారని ఉదయభాను ఆరోపించింది. ఈ విషయమై దర్శకుడు శ్రీధర్‌ వద్ద ప్రస్తావిస్తే ''ఉదయభాను ఆరోపణలు నిరాధారం. ఆమె ఎందుకలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు''అన్నారు.

    Udaya Bhanu alleges use of morphed pictures on posters
    ఉదయభాను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మధుమతి'. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. తనకు జరిగిన అన్యాయం గురించి ఉదయభాను హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో వివరించారు. అలాగే, వెబ్‌సైట్‌లో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రచార చిత్రాలు రూపొందించారని, దీనిపై న్యాయపోరాటం చేయబోతున్నానని ఉదయభాను ప్రకటించారు. కనీసం తనకు సినిమా ప్రివ్యూను కూడా చూపించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన తరువాత ప్రివ్యూ చూసే అవకాశం రావడం దురదృష్టకరమన్నారు. తాను అశ్లీల దృశ్యాల్లో నటించినట్లు మార్ఫింగ్ చేసి తన ఇమేజ్‌ను దెబ్బ తీశారని.. నిజానికి తాను ఎలాంటి అశ్లీల దృశ్యాల్లోనూ నటించలేదని ఉదయభాను సీసీఎస్ డీసీపీ పాల్‌రాజుకు వివరించారు. అయితే, సినిమా ప్రివ్యూ చూసిన తరువాత అందులో ఎలాంటి అశ్లీలత లేదని పోలీసులు ధ్రువీకరించారు.

    ఉదయభాను మాట్లాడుతూ... ''నాకు సినిమా కథ చెప్పినప్పుడు ఎంతో నచ్చి నటించడానికి అంగీకరించాను. ఇప్పుడు చూస్తే పూర్తిగా కథని, నా పాత్రని మార్చేశారు. విడుదలకు ముందు నాకు సినిమా చూపించలేదు. అసలు విడుదలవుతున్న విషయమే ఎవరో చెప్తే ఐదురోజుల క్రితం తెలిసింది. ఈ లోగా నా గురించి కొన్ని వెబ్‌సైట్లు, పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశాను. వాళ్లు సమయం చాలదు మేము ఏమీ చేయలేం పోలీసుల్ని ఆశ్రయించమన్నారు. దీంతో వారిని ఆశ్రయించాను. వాళ్ల ద్వారా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. పోలీసుల సహాయంతోనే నేను, తమ్మారెడ్డి భరద్వాజగారు గురువారం సినిమా చూశాం. నాకే ఇబ్బందికరంగా అనిపించింది. నాలాంటి వాళ్లు ఎవరూ భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా దీనిపై పోరాటం చేస్తాను'' అన్నారు ఉదయభాను.

    English summary
    A criminal case was registered against Raj Sridhar, director of Telugu film ‘Madhumati’, after the film heroine, Udaya Bhanu, alleged that the film promo and posters contained her morphed pictures. The Hyderabad Central Crime Station sleuths, who invoked sections 419 (impersonation) and 420 (cheating) of Indian Penal Code against the film director Raj Sridhar, on Friday said that they would send some parts of the film to forensic experts to ascertain if any morphed images were included in it. Controversy surrounded the film when Ms. Bhanu charged that the film supposed to be released on Friday contained some obscene content with her morphed images.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X