»   » ఫోటోలు : సెక్సీగా సెగలు రేపుతున్న ఉదయభాను

ఫోటోలు : సెక్సీగా సెగలు రేపుతున్న ఉదయభాను

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆ మధ్య రెండు మూడు సినిమాల్లో ఐటం సాంగుల్లో ఉదయభాను మెరిసినా....ఎక్కువగా బుల్లితెరకే పరిమితం అయింది. తొలిసారిగా ఉదయభాను హీరోయిన్‌గా సినిమా తెరపైకి రాబోతోంది. ఉదయభాను ప్రధాన పాత్రలో గోమాతాఆర్ట్స్ పతాకంపై కడియం రమేష్ సమర్పణలో రాణీ శ్రీధర్ 'మధుమతి' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మధుమతి సినిమా గురించి దర్శకుడు రాజ్ శ్రీధర్ మాట్లాడుతూ...'నేను ఉదయభాను‌కు సరిపోమే కథని 8 సంవత్సరాల క్రితమే తయారు చేసుకోవడం జరిగింది. విచ్చలవిడిగా తిరిగే ఒక తెలుగు అమ్మాయిని అనుకోని పరిస్థితులో తమిళ అబ్బాయి తన ఇంటికి తీసుకెళ్ళడంతో ఎదురయ్యే పరిణామాలు‌ను తనకి అనుగుణం ఎలా మలుచుకున్నాడు అన్నది ఈ చిత్ర కథ. ఈ సినిమా పూర్తి హాస్యభరితంగా, కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా సినిమా ఉంటుంది' అన్నారు.

సమర్పకులు కడియ రమేష్ మాట్లాడుతూ...అండర్ వాటర్లో తీసిన సీన్లు చాలా బాగా వచ్చాయి. ఉదయభాను ఎంతో ధైర్యంగా ఈ సీన్లు చేసింది. కెమెరామెన్ వి.ప్రభాకర్ ఎంతో అద్భుతమైన పనితనం కనబర్చారు. నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పని చేసారు. ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు.

ఉదయభాను, దీక్ష్, శివకుమార్, గౌతమ్, సీత, తెలంగాణ శకుంతల, ప్రభాస్ శ్రీను, కమెడియన్ వేణు, సతీష్, బస్టాప్ కోటేశ్వరరావు, నాగభైరవ అరుణ్ కుమార్ తదితరులు నటించిన ఈచిత్రానికి ఫోటోగ్రఫీ : సత్య వి.ప్రభాకర్, సంగీతం : రాజ్ కిరణ్, నిర్మాత: రాణి శ్రీధర్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : రాజ్ శ్రీధర్.

ఉదయభాను తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం మధుమతి

ఈ చిత్రంలో ఉదయభాను విచ్చలవిడిగా తిరిగే అమ్మాయిగా నటిస్తోంది.

మధుమతి షూటింగ్ పూర్తయింది. త్వరలో ఆడియో విడుదల చేసి సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.

మధుమతి చిత్రంలో ఉదయభాను అండర్ వాటర్ సీన్లలో డేరింగ్ గా నటించింది.

ఈ చిత్రానికి పని చేసిన కెమెరామెన్ సత్య వి.ప్రభాకర్ రెడ్డి ఎంతో కష్టపడి అద్భుతమైన పనితనం కనబర్చాడు.

నేను ఉదయభాను‌కు సరిపోమే కథని 8 సంవత్సరాల క్రితమే తయారు చేసుకోవడం జరిగిందని దర్శకుడు తెలిపారు.

ఈ సినిమా పూర్తి హాస్యభరితంగా, కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.

English summary
Udaya Bhanu's Madhumati movie shooting completed. According to one of the unit source, Udaya Bhanu did a dare devil stunt all by herself. Madhumati is directed by Raj Srishar and is set for a August release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu