»   » గద్దె కోసం గాడిద కొడుకులంటూ ఉదయభాను సెటైర్లు!?

గద్దె కోసం గాడిద కొడుకులంటూ ఉదయభాను సెటైర్లు!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యాంకర్ ఉదయభాను మాటీవీలో ప్రసారం అవుతున్న 'రేలారే రేలా' కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె స్వయంగా రాసి పాడిన ఓ పాట ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశం అయింది. ఆమె ఈ పాటలో వాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉందనే వాదన వినిపిస్తోంది.

ఆమె పాడిన పాటలో ప్రయోగించిన పదాలు కొన్ని...

గద్దె కోసమే గాడిద కొడుకులు ఇలా...
రావణాసురులంతా చేరీ...రోజుకొక్కా రచ్చబెడుతున్నారు
రాకాసీ బల్లులంతా....రాజ్యమేలే రాజులంటా...
ఆడు తెస్తడా ఈడు తెస్తడా..అవ్వ ఇస్తదా... అయ్య ఇస్తడా... ఎవడు తెచ్చేదేందిరా ఇది ఎవ్వడి జాగీరురా...
ఇక ఆంబోతు లాట సాగేరా...

మరి ఉదయభాను పాట వెనక పరమార్థం చాలా ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో కొందరు నేతల తీరును ఎండగడుతూ ఆమె పాట పడిందనే వాదన వినిపిస్తోంది. మరి నిజంగానే ఆ పాట వెనక అంతపరమార్థం ఉందా? ఇది సాధారణ పాటనా? లేక సెటైర్లతో కూడిన పాటనా? అనేది తేలాల్సి ఉంది. ఉదయభాను రాజకీయాల్లోకి రాబోతోందని పుకార్లు వినిపంచడం గమనార్హం.

ఉదయభాను సినిమా కోణంలోకి వెళితే...తొలిసారిగా ఉదయభాను హీరోయిన్‌గా సినిమా తెరపైకి రాబోతోంది. ఉదయభాను ప్రధాన పాత్రలో గోమాతాఆర్ట్స్ పతాకంపై కడియం రమేష్ సమర్పణలో రాణీ శ్రీధర్ 'మధుమతి' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో ఈచిత్రం విడుదల కానుంది.

English summary
Udaya Bhanu song has been a hot topic in film nagar. Some people said that it is a political satirical song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu