Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా చిట్టి చెల్లి ఇక రాదు.. విషాదంలో యాంకర్ ఉదయ భాను
ఒకప్పుడు యాకర్ గా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న యాంకర్ ఉదయభాను ప్రస్తుతం తన ఫ్యామిలీతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే చాలా కాలం తరువాత ఆమె ఒక విషాదకరమైన వార్తతో ఆమె నెటిజన్స్ ని కదిలించింది. దేవుడిచ్చిన చెల్లె తనతో ఇక లేదంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా తన బాధను వ్యక్తపరచింది.

విడదీయలేని బంధం..
2014 నిగ్గదీసి అడుగు కార్యక్రమం చేస్తున్నప్పుడు నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం ఖుదాబక్షుపల్లి లో నాకు ఈ చిట్టి తల్లితో విడదీయలేని బంధం ఏదో ముడిపడిపోయింది. రజితమ్మ నాకు దేవుడిచ్చిన బంగారు చెల్లెల్లలో ఒకరు. తను ఇక లేదు. 24 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి.. తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయింది.
కరోనా మరణం కాదు..
ఇది కరోనా మరణం కాదు... గాలి నీరు నింగిని కల్మషం చేసిన కరుణ లేని కర్కశుల వల్ల కలిగిన మరణం. ఫ్లోరైడ్ రక్కసి కోరల్లో చిక్కుకున్న నిస్సహాయులైన బిడ్డలెందరో.. కలుషిత నీటి రూపం లో ఫ్లోరైడ్ విషం తాగుతున్న బిడ్డలెందరో.. తాము చేయని తప్పుకు జీవితాంతం శిక్షను అనుభవిస్తున్న అసహాయులు ఎందరో.. అలంటి బిడ్డే ఈ రజితమ్మ.

నా గుండె తరుక్కుపోయింది..
తనకు నా చేతనైంది చేయాలనీ సంకల్పించి తన కాళ్ళ మీద తాను నడవలేకపోయిన, తన జీవితం లో తలెత్తుకుని బ్రతకాలని ఓ చిన్ని ప్రయత్నం చేసాను. ఒక చిన్న కిరానా కొట్టు పెట్టించాను.. అప్పటినుంచి తన తుది శ్వాశ వరకు ఓటమి ఎరుగక ఎంత ముద్దుగా చక్కగా షాప్ ని నడుపుకుందో.. తను తన కుటుంబానికి భారం కాదు ఆసరా అయింది..

సమాధానం చెప్పేది ఎవ్వరు?
ఖుదాభక్షపల్లి లో భూగర్భంలోకి నీరింకినట్టు నా కళ్ళలో నీళ్లింకిపోతున్నాయి.. అక్క నేనెందుకు ఇలా అయ్యాను.. నా తప్పేంటి.. నాలా ఇంకెంతమంది.. ఇంకెంతకాలం ఇలా పుడతారు.. ఇలా తను సంధించిన ప్రశ్నలకి సమాధానం చెప్పేది ఎవ్వరు ? నా చిట్టి చెల్లి రజితమ్మ ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నా' అని ఉదయ భాను పేర్కొన్నారు.