»   » ప్రపంచ సుందరి తో పోటీ పడిన ఉదయభాను సొగసులు!

ప్రపంచ సుందరి తో పోటీ పడిన ఉదయభాను సొగసులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాల్లో నటించి మంచి తారగా గుర్తింపు తెచ్చుకోవాలని వచ్చిన క్రేజీ యాంకర్ ఉదయభాను, రెండు, మూడు చిత్రాలలో విపరీతంగా నటించినా అవకాశాలు రాకపోవడంతో చేసేదిలేక బుల్లితెర యాంకర్ గా స్థిరపడపోయింది. ఇప్పుడున్న యాంకర్లలోఆమెతో పాటు సంపాదించగలిగే వారు..ఆమెతో పాటు షోలను హంగామ చేసేవారు, ప్రేక్షకులను మెప్పించ గలిగే వారు ఎవరూ లేరంటే ఆశ్చర్యపోనక్కరలేదు. ఎన్ని బుల్లితెర వేషాలు వేసినా వెండితెరపై మాత్రం తనకు ఆశ చావలేదంటూ రీసెంట్ గా విడుదల అయిన రానా 'లీడర్" లో'రాజశేఖరా నీపై మోజు తీరలేదురా" ఐటం సాంగ్ లో తళుక్కున మెరిసింది, మెరవడం ఏంటి మెరిపించింది, మురిపించింది, ప్రేక్షకుల చేత కేరింతలు పెట్టించింది.

ఆ పాటలో ఆమె ఆరబోసిన అందాలు చిత్రానికే హైలెట్ అంటున్నారు విమర్శకులు.. అయితే మరికొందరు అభిమానులైతే ఐశ్వర్యతో పోల్చుతున్నారట. ఎందుకంటే ఐష్ 'కజరారే కజరారే" అనే హిందీ పాటను అమితాబ్, అభిషేక్ లతో కలిసి చేసింది. ఈ పాటను ఐశ్వర్య ఎంత ఊపుగా చేసిందో ఉదయభాను అంతే ఊపుగా 'లీడర్" పాట చేసిందని అభిమానులు అంటున్నారట. అయితే ఈ పాటతో శేఖర్ కమ్ముల కూడా మంచి కమర్షియల్ పాట చేయగలడు అని నిరూపించుకున్నాడని చిత్రసీమకు చెందిన వారు అంటున్నారు.

ఒక్క భారత్ లోనే కాకుండా విదేశాలకు పరిచయం చేసిన బుల్లి తెర కార్యక్రమాలను మాత్రం వదిలిపెట్టనంటూ అలాగే వెండితెరలో నటించే అవకాశం వస్తే వదులుకోనంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తానంటుంది ఉదయభాను, మరి ఈ ప్రయాణం ఎటు దారి తీస్తుందో మాత్రం చెప్పలేమంటున్నారు విమర్శకులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu