»   » తొలి చిత్రం నుంచి ఇప్పటిదాకా : ఎన్టీఆర్ లో మార్పులు ఇలా (ఫొటో ఫీచర్)

తొలి చిత్రం నుంచి ఇప్పటిదాకా : ఎన్టీఆర్ లో మార్పులు ఇలా (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ ప్రారంభ రోజుల్లో తన లావు శరీరంతో అందరి చేతా విమర్శలు పాలయ్యేవాడు. నటన ఎంత అధ్బుతంగా చేసినా, డాన్స్ లు అదరకొట్టినా శరీరం మాత్రం ప్యాట్ గా ఉండటం ఇబ్బందిగా ఉండేది. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఆయన రామయ్యా వస్తావయ్యా, టెంపర్ ఇలా సినిమా సినిమాకీ మారుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన్ను చూసిన వారు షాక్ అవుతున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'టెంపర్‌'లో షర్టు విప్పి సందడి చేశాడు ఎన్టీఆర్‌. ఆ సినిమాలో తారక్‌ కొత్తగా కనిపించాడు. తదుపరి సినిమా కోసం మరో సరికొత్త అవతారం ఎత్తారు.

వాస్తవానికి ఎప్పటికప్పుడు కొత్తగా కన్పించేందుకు ఎన్టీఆర్ ట్రై చేస్తుంటారు. ఈ సారి వీలయినంత స్టైలిష్ గా, ట్రెండీ లుక్ లో కన్పించి.. అభిమానుల అభినందనలు అందుకోవాలనుకుని ఫిక్సైనట్లున్నాడు. తాజాగా తను సుకుమార్ తో చేస్తున్న చిత్రంతో ఆ వేరియేషన్ కనిపించేలా చేసాడు.

కొన్నాళ్లుగా సుకుమార్ సినిమా కోసం గుబురుగా గడ్డం పెంచుతున్న ఎన్టీఆర్... రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ ఆరంభమవడంతో... ట్రెండీ లుక్ లో డిఫరెంట్ గా కన్పించి అభిమానులను ఆనందపరచాడు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ తొలి రోజుల నుంచి ఎలా ఉన్నారు..ఎలా మారుతూ వస్తున్నాడు అనేది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

స్లైడ్ షోలో ఆ మార్పులు చూడండి...

సుకుమార్ చిత్రం కోసం...

సుకుమార్ చిత్రం కోసం...

ఎన్టీఆర్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన ఇలా రెడీ అయ్యారు.

ప్రారంభ రోజుల్లో

ప్రారంభ రోజుల్లో

ఎన్టీఆర్ అప్పట్లో ఇలా ఉండేవారు. ఆయన తొలి రోజుల నాటి సినిమాల్లో ఇలాంటి లుక్ తో కనిపించేవారు

బాగా లావుగా

బాగా లావుగా

కృష్ణవంశీ తో చేసిన రాఖి చిత్రం లో ఎన్టీఆర్ ఇలా కనిపించారు.

యమదొంగ

యమదొంగ

రాజమౌళి దర్శకత్వంలో చేసిన యమదొంగలో అప్పుడు ఇలా తగ్గి ఎన్టీఆర్ కనిపించటం ఆశ్చర్యం కలిగించింది.

కంత్రిలో ఇలా

కంత్రిలో ఇలా

మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన కంత్రి చిత్రంలో ఎన్టీఆర్ ఇలా స్లిమ్ లుక్ లో కనపడ్డారు.

బాద్షా లో

బాద్షా లో

ఎన్టీఆర్ ...శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన బాద్షా చిత్రంలో ఇలా కనిపించారు.

రభస

రభస

రభస,రామయ్యా వస్తావయ్యా చిత్రాలు రెండింటిలోనూ ఎన్టీఆర్ కూల్ గా కనిపించి అలరించారు.

పూర్తి మార్పు

పూర్తి మార్పు

టెంపర్ సినిమాకు వచ్చేసరికి ఎన్టీఆర్ పూర్తిగా మారిపోయారు

ఏది నచ్చింది

ఏది నచ్చింది

ఈ లుక్ లు అన్నిటిలోనూ మీకు ఏది నచ్చిందో ..క్రింద కామెట్స్ రూపంలో తెలపండి.

కొత్త లుక్ అదుర్స్

కొత్త లుక్ అదుర్స్

ఎన్టీఆర్ తన కొత్త లుక్ లో అద్బుతంగా కనిపిస్తున్నాడంటూ అంతటా వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ కేశాలంకరణ మార్చారు. గడ్డం పెంచారు. ఆ లుక్‌.. చిత్రబృందం బయటపెట్టింది.

రకుల్ హీరోయిన్ గా చేస్తున్న సుకుమార్ చిత్రం సెప్టెంబరు 20 వరకూ లండన్‌లోనే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. హైదరాబాద్‌లోనూ ఇరవై రోజుల పాటు షూటింగ్‌ జరుపుతారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కో ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు

English summary
Unbelievable Transformation Of Jr NTR
Please Wait while comments are loading...