»   » మహేష్ బాబు నుండి ఇలాంటి ట్వీట్ ఊహించలేదు!

మహేష్ బాబు నుండి ఇలాంటి ట్వీట్ ఊహించలేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు... ట్విట్టర్లో అత్యధిక మంది పాలోవర్స్ ఉన్న తెలుగు స్టార్ హీరో. ఆయన ట్వీట్ చేసారంటే ఏదో ఒక విశేషం ఉంటుంది. ముఖ్యంగా ఆయన సినిమాలకు సంబంధించిన ట్వీట్స్, లేదా అభిమానుల గురించి చెప్పే మాటలు, లేదా తన పర్సనల్ విషయాలకు సంబంధించిన విషయాలు తప్ప...అనవసర విషయాలు చెప్పడం మహేష్ బాబుకు అలవాటు లేదు.

మహేష్ బాబు ఎన్నో కార్పొరేట్ బ్రాండ్లకు ప్రాచారం చేస్తున్నా....ఇప్పటి వరకు వాటి నీడ తన ట్విట్టర్ అకౌంట్ మీద పడనీయలేదు. కానీ ఈ రోజు మహేష్ బాబు ఈ రోజు తన ట్విట్టర్లో తొలిసారిగా తన వ్యాపార ప్రకటన దర్శనమిచ్చింది. చాలా ఎగ్జైట్ అయ్యానంటూ మహేష్ బాబు పేర్కొన్నారు. అయినా అందులో అంత ఎగ్జైట్ అయ్యే విషయం ఏముందని? అభిమానులు, ప్రేక్షకులు బహుషా ఆయన ట్విట్టర్ నుండి ఇలాంటి ట్వీట్ ఊహించి ఉండరేమో!మహేష్ బాబు తాజా సినిమా ‘శ్రీమంతుడు' విషయానికొస్తే..కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీమంతుడు' చిత్రం ఆడియో ఈ నెల 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియో వేడుక టెలికాస్ట్ రైట్ష్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.


ఓ ప్రముఖ చానల్ రూ. 1 కోటి రూపాయలకు రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలి ఆడియో వేడుక టెలికాస్ట్ రైట్స్ రూ. 1.5 కోట్లకు అమ్ముడయ్యాయి. బాహుబలి తర్వాత ఆడియో టెలికాస్ట్ రైట్స్ అత్యధిక ధరకు అమ్ముడు పోయిన సినిమా ఇదే.


 Unexpected Tweet from Mahesh Babu

మహేష్ బాబు సరసన శృతి హాసన్‌ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.


English summary
Unexpected Tweet from Mahesh Babu. "Very Excited about my new ad for the 2015 edition TVS Phoenix 125" Mahesh Babu Tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu