twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జయలలిత గురించి.... బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!

    జయలలిత అందరికీ ముఖ్యమంత్రిగా, సినీ నటిగా మాత్రమే తెలుసు. అయితే ఆమె జీవితంలో బయటి ప్రపంచానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి.

    By Bojja Kumar
    |

    చెన్నై: జయలలిత అందరికీ ముఖ్యమంత్రిగా, సినీ నటిగా మాత్రమే తెలుసు. అయితే ఆమె జీవితంలో బయటి ప్రపంచానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. చాలా మందికి ఆమె కేవలం సౌత్ సినిమాలతో పాటు కొన్ని హిందీ సినిమాల్లో నటించినట్లు మాత్రమే తెలుసు.

    చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే...సినిమా రంగంలోకి రాక ముందే ఆమో ఓ ఆంగ్ల లఘు చిత్రంలో నటించారు. మాజీ భారత రాష్ట్రపతి వీవీ గిరి కుమారుడు శ్రీ శంకర్‌ గిరీ 1961లో నిర్మించి, దర్శకత్వం వహించిన 'ఎపిస్టిల్‌' అనే ఆంగ్ల లఘు చిత్రంలో ఆమె నటించారు. చాలా మందికి ఈ విషయం తెలియదు.

    సినీరంగంలోకి వచ్చి ఇంత పెద్ద స్టార్ గా ఎదిగిన జయలలిత ఇష్టం లేకుండానే ఈ రంగంలోకి అడుగు పెట్టారు. తన 15వ ఏట తల్లిబలవంతం చేయడంతో హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసారు.

    అదో అడల్ట్ మూవీ

    అదో అడల్ట్ మూవీ

    జయలలిత ‘వెన్నిర అదయ్‌' అనే తమిళ చిత్రంలో తొలిసారిగా లీడ్‌ రోల్‌లో నటించారు. ఇందులో ఆమె యంగ్ విడోగా నటించారు. అయితే ఆ సినిమాకు అడ్లట్(A) సర్టిఫికేట్‌ ఇవ్వడంతో ఈ సినిమాను థియేటర్లో చూడలేక పోయింది. అందుకు కారణం అప్పటికి జయవయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే.

    ఆత్మహత్య ఆలోచన

    ఆత్మహత్య ఆలోచన

    పెళ్లైన శోభన్‌ బాబుతో పీలకల్లోతు ప్రేమాయణం, ఇద్దరి మధ్య విబేధాలు, సినిమా అవకాశాలు తగ్గడం, తల్లి మరణం, బంధువులు ఉన్న వారికి తన డబ్బుమీదే మమకారం తప్ప తనపై లేక పోవడం, నా అనే వాళ్లు లేరనే భావనతో ఒకానొక సందర్భంలో జయలలిత ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అప్పుడే ఎంజీ రామచంద్రన్‌ ఆమెకు ధైర్యం చెప్పి ఆ ఆలోచన నుండి బయట పడేసారు. ఆయన ద్వారానే 1982లో జయలలిత రాజకీయాల్లోకి వచ్చారు.

    తమిళంలో అదో రికార్డ్

    తమిళంలో అదో రికార్డ్

    తమిళ సినిమాల్లో స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించి, జలపాతంలో తడిసి అందాలు ఆరబోసిన మొదటి హీరోయిన్ జయలలితే. అప్పట్లో అదో రికార్డ్.

    చదువులో స్టేట్ ఫస్ట్

    చదువులో స్టేట్ ఫస్ట్

    మద్రాసులో టాప్ పాఠశాలల్లో ఒకటైప 'చర్చి పార్క్ కాన్వెంట్'లో జయలలితను చదివారు. జయలలిత చాలా తెలివైన స్టూడెంట్. పదో తరగతిలో తమిళనాడులోనే ఎక్కువ పర్సంటేజ్ మార్కులు సాధించిన విద్యార్థినిగా అవార్డు కూడా సాధించారు.

    హిట్ హీరోయిన్

    హిట్ హీరోయిన్

    జయలలిత 85 తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించగా, వాటిలో 80 చిత్రాలు సూపర్‌ హిట్టయ్యాయి. తెలుగులో ఆమె దాదాపు 30 సినిమాలు చేస్తే అందులో 25 చిత్రాలు హిట్టయ్యాయి.

    జయ-లలిత పేరు వెనక

    జయ-లలిత పేరు వెనక

    జయలలిత చిన్న వయసులో ఉన్నపుడు వారి కుటుంబం మైసూర్‌లోని రెండు ఇళ్లలో ఉన్నారట. అందులో ఒకటి జయ విలాస్‌ కాగా, మరొకటి లలిత విలాస్‌ . ఆ రెండు కలపి జయలలితగా ఆమె తల్లి, తండ్రులు నామకరణం చేశారట. అలా జయలలితకు పెట్టిన అసలు పేరు - 'కోమలవల్లి'. ఆ తర్వాత స్కూల్ లో చేర్పించే సమయంలో 'జయలలిత' అని నామకరణం చేశారు.

    జయలలిత తాత

    జయలలిత తాత

    జయలలిత తాత నరసింహన్ రంగాచారి మైసూరు సంస్థానంలో మైసూర్ మహరాజా జయరామ రాజేంద్రకు వైద్యుడిగా వ్యవహరించేవారు. అందుకే తన వారసుల పేర్లకు ముందు 'జయ' అని చేర్చేవారు. జయలలిత సోదరుడి పేరు జయకుమార్.

    తండ్రి చనిపోవడంతో

    తండ్రి చనిపోవడంతో

    రెండేళ్ల వయసులోనే జయలలిత తండ్రి జయరామ్ చనిపోయారు. కుటుంబ బాధ్యతను మోయడం కోసం ఆమె తల్లి వేదవల్లి టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకొని, బెంగులూరులో గుమస్తాగా పని చేయడం మొదలుపెట్టారు.

    అలా మద్రాసుకు

    అలా మద్రాసుకు

    వేదవల్లి తర్వాత మద్రాసులో ఎయిర్‌హోస్టెస్‌గా, రంగస్థల నటిగా కొనసాగుతున్న తన సోదరి అంబుజవల్లి దగ్గరికి వచ్చారు. కూతురిని బెంగుళూరులోని తనతల్లిదండ్రుల వద్దే ఉంచి వేదవల్లి మద్రాసులో ఉంటూ, సంధ్యగా పేరు మార్చుకుని నాటకాల్లోకి, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. అటుపైన ఆర్థికంగా ఫర్వాలేదనిపించడంతో కుమార్తెను కూడా మద్రాసు తీసుకెళ్ళారు.

    బాలనటిగా

    బాలనటిగా

    బాల నటిగా జయలలిత నటించిన తొలి కన్నడ చిత్రం 'శ్రీశైల మహాత్మె' (1961). ఇందులో పార్వతిదేవిగా ఆమె నటించారు. తర్వాత 'మన్ మౌజీ' అనే హిందీ మూవీలో కృష్ణుడి వేషం వేశారు. జయను చూసిన మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి కుమారుడు శంకరగిరి తాను తీసిన 'ది ఎపిసిల్' అనే ఇంగ్లిష్ లఘు చిత్రంలో ఆమెను తీసుకున్నారు.

    పదో తరగతి సెలవుల్లో హీరోయిన్ గా

    పదో తరగతి సెలవుల్లో హీరోయిన్ గా

    కర్ణన్ అనే మూవీ విజయోత్సవంలో జయలలితను చూసిన దర్శక - నిర్మాత బీఆర్ పంతులు ఆమెను 'చిన్నద గొంబె' (1964)లో కథానాయికగా పరిచయం చేస్తానని జయ తల్లిని అడిగారు. అయితే అయితే జయ అప్పుడే పదో తరగతి పరీక్షలు రాసి సెలవుల్లో ఉండటంతో....కాలేజీ తెరిచేలోపు సినిమా పూర్తి చేయాలని కండీషన్ పెట్టింది. ఆ సెలవుల్లోనే సినిమాన పూర్తి చేసారు. అలా సెలవుల్లో హీరోయిన్ గా మారిపోయింది జయ.

    లాయర్ అవ్వాలనుకుంది..కానీ

    లాయర్ అవ్వాలనుకుంది..కానీ

    తండ్రి లాయర్ కావడంతో ఆ ప్రభావం జయపై పడింది. అయితే లా చదవాలనుకున్న జయ ఆశ ఫలించలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నుండి గట్టేక్కేందుకు తల్లి బలవంతంతో సినిమా హీరోయిన్ అయింది.

    అలా వార్నింగ్ ఇచ్చిన తల్లే... తర్వాత

    అలా వార్నింగ్ ఇచ్చిన తల్లే... తర్వాత

    అప్పటికే నటిగా మేకప్ వేసుకున్న సంధ్యకు కూతురు జయ మేకప్ వేసుకోవడం ఇష్టం లేదు. అయితే ఓసారి 'మేకప్ వేసుకున్న జయకు ఆమె వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ మేకప్ వేసుకున్నా, సినిమాల జోలికి వచ్చినా ఊరుకునేది లేదు' అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అలాంటి తల్లే చివరకు లాయర్ అవుదామనుకున్న ఆమె ఆశలపై నీళ్లు చల్లి చదువు మాన్పించి సినిమాల్లోకి తీసుకెళ్లారు.

    గాయనిగా

    గాయనిగా

    జయలలిత తొలిసారి 1969లో నటించిన 'అడిమై పెణ్'లో 'అమ్మా ఎన్‌డ్రాల్ అన్బు..' అనే పల్లవితో సాగే పాటను పాడారు. ఆ చిత్రం తర్వాత కూడా పలు సినిమాల్లో పాడారు. సినిమాలకు సంబంధం లేని మూడు భక్తి ఆల్బమ్స్‌కు కూడా ఆమె గాత్రం అందించారు.

    English summary
    Unknown facts about Jayalalitha. Jayalalithaa was forced to join the Tamil Film industry by her actress mother Sandhya (Real Name-Vedavathi) at the age of 15. She was still a student and a state level topper when she joined acting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X