twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరా టైటిల్ మామూలుగా పెట్టలేదు: అప్పటి జనం నోట పలికిన పాట గురించి తెలుసా?

    నిన్నా మొన్నటిదాకా చిరు 150 కి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అనే టైటిలే అనుకున్నారు. వారం పది రోజుల ముందు వరకు కూడా ఈ టైటిల్‌కే ఫిక్సయి ఉన్నారు. కానీ ఉన్నట్లుండి సీన్ మారిపోయింది. ఈ చిత్రానికి 'సైరా' అం

    |

    నిన్నా మొన్నటిదాకా చిరు 150 కి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అనే టైటిలే అనుకున్నారు. వారం పది రోజుల ముందు వరకు కూడా ఈ టైటిల్‌కే ఫిక్సయి ఉన్నారు. కానీ ఉన్నట్లుండి సీన్ మారిపోయింది. ఈ చిత్రానికి 'సైరా' అంటూ కొత్త టైటిల్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

    టైటిల్లో ఫోర్స్ ఉందని

    టైటిల్లో ఫోర్స్ ఉందని

    ఈ టైటిల్ విషయంలో జనాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఈ టైటిల్లో ఫోర్స్ ఉందని, బాగుందని అంటే.. ఇంకొందరేమో మామూలు మసాలా సినిమాకు పెట్టినట్లు 'సైరా' అని టైటిల్ పెట్టారేంటి అని పెదవి విరిచారు. చక్కగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అనే పెట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. ఐతే ఈ టైటిల్ విషయంలో విమర్శలు గుప్పిస్తున్న వారికి సమాధానంగా సోషల్ మీడియాలో ఒక పాటని షేర్ చేస్తున్నారు

    Recommended Video

    Pizza Movie Hero Playing Villan Charecter In Chiranjeevi's "SYE RAA"
     ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి

    ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి

    మొద‌ట్లో సై రా అంటే ఏమిటో ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ‘సై..' ‘రా' అంటూ ప్ర‌త్య‌ర్థిని క‌వ్వించే గుణం ఉన్న వీరుడు కాబ‌ట్టి.. ఈ పేరు సెట్ చేశారా? లేదంటే మాస్‌కి చేరువ అవ్వ‌డానికి క‌మ‌ర్షియ‌ల్‌గా ఆలోచించారా? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. అయితే రాయ‌ల‌సీమ‌లో ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డిపై జ‌న‌ప‌దులు ఓ గీతాన్ని పాడుకొంటారు.

    న‌ర‌సింహారెడ్డి గొప్ప‌ద‌నం

    న‌ర‌సింహారెడ్డి గొప్ప‌ద‌నం

    ఆ పాట ‘సైరా' అనే ప‌దంతో ప్రారంభం అవుతుంది. రాయ‌ల‌సీమ‌లో ఈ పాట చాలా పాపుల‌ర్‌. ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి గొప్ప‌ద‌నం కీర్తిస్తూ పాడే ఈ పాట‌లోని తొలి ప‌దాన్నే.. టైటిల్‌గా పెట్ట‌డంతో రాయ‌ల‌సీమ వాసుల మ‌న‌సుల్ని గెలుచుకొనే ప్ర‌య‌త్నం చేసింది చిత్ర‌బృందం.

    రాయలసీమలో జానపదగీతం

    రాయలసీమలో జానపదగీతం

    నరసింహారెడ్డి మీద రాయలసీమలో వీథిగాయకులు పాడుకునే జానపదగీతం ఒకటి ఉంది. దాన్ని "రాయలసీమ రాగాలు" అన్న పుస్తకంలో మల్లిక్ గారు ప్రచురించారు. అది ఇలా సాగుతుంది.

    "సైరా నరసింహారెడ్డి

    నీ పేరే బంగార్పూకడ్డీ


    రాజారావు తావుబహద్దరు నారసింహారెడ్డి

    రెడ్డి కాదు బంగార్పుకడ్డి నారసింహారెడ్డి

    ముల్ కోల్ కట్టె సేతిలో ఉంటే మున్నూటికీ మొనగాడు

    రెడ్డి మాటలు ఏదాలురా రాండి సూరులారా (సైరా)


    మొనగాండ్రకు రేనాటి గడ్డరా - రోషగాండ్రకు పెద్ద పేరురా

    దానధర్మములు దండిగ జేసే - పురిటిగడ్డలో పుట్టినావురా

    కల్వటాల దండదిగో రా సై - ముక్క ముళ్ళ దండదిగోరా సై

    సంజామల దండదిగోరా సై - కానాల దండదిగోరా సై (సైరా)


    బానిసగుండి పాయసం తాగుట మేలుకాదురన్నా

    పచ్చులలాగా బతికితె రెండే గింజలు మేలన్నా (పచ్చులలాగా = పక్షులలాగా)

    బయపడి బయపడి బతికేకంటే సావే మేలన్నా

    ఈరుడు సచ్చిన జగతిలొ ఎప్పుడు బతికే ఉండన్నా (సైరా)


    నరసిమ్మా అని దూకినాడురా రణంలోన రెడ్డి

    తెల్లోలందరి కుత్తుకలన్ని కోసినాడు రెడ్డి

    "కోబలీ" యంటా తెల్లసర్కరును నరికెను దండంత

    గడ్డ కోసము సావో బతుకో తేల్చుకున్నరంత (సైరా)

     ఉయ్యాలవాడ చరిత్ర

    ఉయ్యాలవాడ చరిత్ర

    ఇలా సాగుతుంది ఆ పాట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరత్వం, గొప్పదనం గురించి చెబుతూ ఈ పాటని తయారు చేశారట అప్పట్లో ఆయన అభిమానులు. రాయలసీమలో ఊరూరా అప్పట్లో ఈ పాట పాడుకునేవారట. 'సైరా నరసింహారెడ్డి' అనేది అప్పట్లో ఒక ఊతపదం లాగా ఉండేదట. అది వినగానే జనాల్లో ఒక ఉత్సాహం వచ్చేదట. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఉయ్యాలవాడ చరిత్రను అధ్యయనం చేసిన పరుచూరి బ్రదర్స్ ఈ టైటిల్ ని సజెస్ట్ చేసారట.

    English summary
    Unknown Story Of Chorus New Movie Title As Sye Raa Narasimha Reddy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X