»   » రంగస్థలం సక్సెస్ తర్వాత ఉపాసన ఆసక్తికరమైన ట్వీట్

రంగస్థలం సక్సెస్ తర్వాత ఉపాసన ఆసక్తికరమైన ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం తొలి ఆట నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఓవర్సీస్ మార్కెట్లో భారీ కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. ప్రేక్షకుల అండతో రంగస్థలం సినిమా దూసుకుపోతున్న నేపథ్యంలో రాంచరణ్ సతీమణి ఉపాసన కామినేని నీ ప్రేమకు దాసోహమయ్యాం అని ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

బాబా.. నీవు మా కోసం ఏదైతో చేశావో.. ఏదైతే చేస్తున్నావో.. భవిష్యత్‌లో మాకు ఏం చేయబోతున్నావనే విషయానికి నీకు ధన్యవాదాలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా రాంచరణ్, రంగస్థలం అని హ్యాష్ ట్యాగ్ చేసి సాయిబాబా ఫోటోను ట్వీట్ చేశారు.

విభిన్నమైన చిత్రంగా రూపుదిద్దుకొన్న రంగస్థలం సినిమాపై ఉపాసన, రాంచరణ్ భారీగా ఆశలు పెట్టుకొన్నారు. దాదాపు రెండేళ్లు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి సినిమా రూపొందించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం విడుదలకు ముందే మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్నది.

English summary
Ram Charan and Samantha Akkineni‘s Rangasthalam was one of the most awaited Telugu films of the year. And looks like the film has opened very well. In this occassion, Ram Charan's wife Upasana Kamineni tweeted a interesting news after Rangasthalam success.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X