రాంచరణ్‌తో ఉన్నది ఎవరో గుర్తుపట్టండి ! ఉపాసన ట్వీట్..!
అర్జున్ రెడ్డి చిత్రం సంచలన విజయం సాధించడంతో ఆ సినిమా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాపై దేశవ్యాప్తంగా దృష్టిపడింది. అతనిలో ఉన్న టాలెంట్‌కు రాంగోపాల్ వర్మ లాంటి దర్శకులే ఫిదా అయిపోయారు. కటెంట్, స్క్రీన్‌ప్లేపై ఉన్న పట్టు అతన్ని అగ్రస్థానాన నిలబెట్టింది. అయితే అర్జున్‌రెడ్డి తర్వాత తదుపరి చిత్రంపై ఇంకా సమయం తీసుకొంటున్న సందీప్ వంగా తాజాగా రాంచరణ్‌తో కనిపించడం చర్చనీయాంశమైంది.
రాంచరణ్‌తో సందీప్‌రెడ్డి
రాంచరణ్ హీరోగా సందీప్ వంగా తన తదుపరి చిత్రానికి సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నట్టు మీడియాలో గత కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. సందీప్ డైరెక్షన్‌లో వచ్చే చిత్రాన్ని సొంత బ్యానర్‌లో రూపొందించేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది.
క్రిస్మస్ ట్రీ వద్ద చెర్రీతో
కాగా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాంచరణ్ భార్య ఉపాసన కామినేని రూపొందించిన క్రిస్మస్ ట్రీ వద్ద రాంచరణ్‌తో కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ రేపింది. ఈ ఫొటోను ఉపాసన స్వయంగా ట్వీట్ చేయడం గమనార్హం.
ఉపాసన ట్వీట్ చేసిన ఫొటోలో రాంచరణ్, సందీప్ రెడ్డి వంగా, శర్వానంద్ తదితరులు ఉన్నారు. క్రిస్మస్ ట్రీని చేసింది విస్తరాకులు రీసైక్లింగ్ చేసిన వాటితో రూపొందించాను. రాంచరణ్‌తో ఉన్నది ఎవరో గుర్తుపట్టండి అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
జక్కన్న, యంగ్ టైగర్‌తో చరణ్
రాంచరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రంగస్థలం చిత్ర షూటింగ్‌లో చెర్రీ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీనులో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. అలాగేఎస్ఎస్ రాజమౌళి రూపొదించే చిత్రం మల్టీస్టారర్ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో నటించనున్నారు.
అర్జున్‌రెడ్డి తర్వాత సందీప్
ఒకవేళ రాంచరణ్‌తో సినిమా వార్త నిజమైతే.. ఈ రెండు చిత్రాల తర్వాత సందీప్‌తో సినిమా చేయవచ్చనేది సినీ వర్గాల అభిప్రాయం. ఈ గ్యాప్‌లో మరో చిత్రాన్ని సందీప్ రెడ్డి చేసే అవకాశం ఉంది.
మహేశ్‌బాబుకు సందీప్ స్టోరి
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. అర్జున్‌రెడ్డి తర్వాత మహేశ్‌బాబుకు సందీప్ రెడ్డి ఓ స్టోరి వినిపించగా ప్రిన్స్‌కు నచ్చినట్టు సమాచారం. కథలో కొన్ని మార్పులు కూడా సూచించినట్టు తెలిసింది. ఇప్పటికే రెండు సిట్టింగులు జరిగినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
Arjun Reddy fame Sandeep Reddy Vanga is hot in Tollywood. Big stars are ready to team with Sandeep. Report suggest that Sandeep impressed Charan with an interesting script. Ram Charan wanted to do the film in his production house. It is still unknown if Charan wants to do the movie or he just wants to produce it with some other hero. Both Charan and Sandeep were seen together last night at a party and the pictures were posted on social media by Charan's wife Upasana Kamineni.
Story first published: Thursday, December 14, 2017, 19:23 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more