»   » ఫోర్బ్స్ జాబితాలో రామ్ చరణ్ భార్య ఉపాసన!

ఫోర్బ్స్ జాబితాలో రామ్ చరణ్ భార్య ఉపాసన!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Upasana Got Place In Forbes Magazine #'Tycoons Of Tomorrow' Winners

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అపోలో లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో బిజినెస్ పరంగా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసనకు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. 'టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో' పేరిట 'ఫోర్బ్స్‌ ఇండియా' విడుదల చేసిన ఉజ్వల భవిష్యత్ ఉన్న శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో ఉపాసన చోటు దక్కించుకుంది. మొత్తం 22 మందితో కూడిన ఈ జాబితాలో తెలుగు నుండి పివి సింధుకు కూడా చోటు దక్కింది.

  vote for your favourite bigg boss contestant here

  దేశం బావుండాలనే మనుషుల ఆరోగ్యం బావుండాలి, మనం ఫిట్ నెస్‌గా, యాక్టివ్‌గా ఉన్నపుడే ఏదైనా సాధించగలం అని నమ్మే ఉపాసన.... అపోలో లైఫ్ ద్వారా ఇందుకకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అపోలో వ్యాపారాన్ని ఆమె నడిపిస్తున్న తీరు, ఆమె శక్తి సామర్థ్యాలు, ఆలోచన విధానానికి ఇప్పటికే పలువురు నుండి ప్రశంసలు అందాయి. తాజాగా ప్రఖ్యాత ఫోర్బ్స్ సంస్థ కూడా ఉపాసన శక్తి సామార్థ్యాలు గుర్తించడం విశేషం.

  ఇపుడు పెడతాడు, తర్వాత జిమ్‌లో చంపుతాడు: చెర్రీపై ఉపాసన ట్వీట్

   Upasana name in Forbes India Tycoons of Tomorrow list

  'టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో' పేరిట ముంబైలో మంగళవారం జరిగే ఈ వెంటులో ఉపాసనతో పాటు ఫోర్బ్స్ ప్రకటించిన 22 మంది ఇన్నోవేటర్స్, ఎంట్రెపెన్యూర్స్‌ను సత్కరించనున్నారు. ఉపాసనకు ఈ గొరవం దక్కడంపై మెగా అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.

  ఉపాసన తన అపోలో బిజినెస్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.... తన భర్త రామ్ చరణ్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, ఆయన నటిస్తున్న సినిమాలు, అతడికి సంబంధించిన అంశాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం గమనార్హం. అటు తన వ్యాపారాన్ని, ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ఉపాసన దూసుకెళుతోంది.

  English summary
  The ‘Forbes India Tycoons of Tomorrow’ event in Mumbai on Tuesday will honour the country’s innovators and entrepreneurs. The panel discussion ‘Building Tomorrow's India’, with Karan Adani, Ashni Biyani, Upasna Kamineni Konidela, Rajeev Karthikeyan, Radha Kapoor Khanna, Anant Goenka will be moderated by Shereen Bhan.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more