»   » ఉప్సి గారండీ....: సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఫన్నీ వీడియో వైరల్

ఉప్సి గారండీ....: సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఫన్నీ వీడియో వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం 'రంగస్థలం' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పల్లెటూరి అబ్బాయి చిట్టిబాబుగా నటిస్తున్నారు చెర్రీ. అయితే షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా చరణ్ ఆ క్యారెక్టర్ నుండి బయటకు రావడం లేదు. ఇంట్లో కూడా చిట్టిబాబులానే ప్రవర్తిస్తున్నాడు. దీంతో అతడి ప్రవర్తనను వీడియో తీసిన ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఫన్నీ వీడియో వైరల్

ఆకలేయడంతో తన భార్య ఉపాసనను భోజనం పెట్టమంటూ అడిగారు రామ్ చరణ్. ‘ఉప్సిగారండీ... చిట్టిబాబుకు ఆకలేస్తోందండీ' అంటూ రామ్ చరణ్ ఫన్నీగా అడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సోషల్ మీడియాలో ఉపాసన

ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె ప్రొఫెషన్, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.

తమ కుటుంబం చేస్తున్న పనుల గురించి

తమ స్వస్థలం దోమకుండలో తన తండ్రి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఉపాసన ట్వీట్.

రామ్ చరణ్ గురించి ట్వీట్

రామ్ చరణ్‌ను ఉపాసన ముద్దుగా మిస్టర్ సి అని పిలుచుకుంటుంది. తామిద్దరం పవర్ ఆఫ్ పాజిటివిటీని నమ్ముతామంటూ ఆమె ఈ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

English summary
Hero Ram Charan is shooting for his upcoming film Rangasthalam which is being directed by Sukumar. Ram Charan is seen making fun on the sets with a toy. Have a glimpse at it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu