twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉపాసన వాటిని తగలబెట్టేసింది... నెగెటివ్ థాట్స్, ఒత్తిడే కారణం! (వైరల్ వీడియో)

    By Bojja Kumar
    |

    Recommended Video

    ఉపాసన వాటిని తగలబెట్టేసింది... నెగెటివ్ థాట్స్, ఒత్తిడే కారణం!

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. కొన్ని పేపర్లను ఆమె కాల్చివేస్తున్నట్లు అందులో ఉంది. అసలు ఉపాసన ఈ పని ఎందుకు చేసిందో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు.

     ఒత్తిడికి గురైన ఉపాసన

    ఒత్తిడికి గురైన ఉపాసన

    ఉపాసన అపోలో ఆసుపత్రి వ్యవహారాలు, అపోలో ఫౌండేషన్ బాధ్యతలు చూసుకుంటూ రోజంతా క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. ఈ క్రమంలో ఒత్తిడికి గురి కావడం, నెగెటివ్ థాట్స్ రావడం లాంటివి సహజం. వాటిని ఎలా అధిగమించానో చెబుతూ ఉపాసన వీడియో పోస్టు చేసింది.

     పేపర్ కాల్చేస్తూ వీడియో...

    పేపర్ కాల్చేస్తూ వీడియో...

    ఉపాసన పోస్టు చేసిన వీడియోలో. కొన్ని పేపర్లు కాల్చి వేస్తున్నట్లు అందులో ఉంది. అలా చేయడం ద్వారా తన మనసులోని నెగెటివ్ థాట్స్, ఒత్తిడి నుండి దూరం అయ్యానని చెప్పుకొచ్చారు ఈ కొణిదెల కోడలు పిల్ల.

     కాల్చేసి బెటర్‌గా ఫీలైన ఉపాసన

    కాల్చేసి బెటర్‌గా ఫీలైన ఉపాసన

    ‘మీతో ఓ టెక్నిక్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మీరూ కూడా ఫాలో అయితే చాలా బెటర్ గా ఫీలవుతారు. నిన్న రాత్రి నేను ఈ టెక్నిక్ ట్రై చేశాను. నా మైండ్ క్లియర్ అయింది. ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు లేకుండా మంచి నిద్ర పట్టింది. ఉదయం లేవగానే ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది' అని ఉపాసన తెలిపారు.

    ఇలా చేయండి సింపుల్

    ఒత్తిడి, నెగెటివిటీని దూరం చేయడానికి ‘మీరు చేయవలసిందల్లా రోజంతా మీ మదిలో ఉన్న నెగెటివ్ థాట్స్ అన్నీ ఒక పేపర్ మీద రెండు మూడు సార్లు రాయండి. అలాంటి ఆలోచనలు మీ మదిలో ఎందుకు వచ్చాయి, కారణాలు ఏమిటో విశ్లేషించండి. మీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది. వెంటనే మీకు ఒత్తిడి మాయం అవుతుంది. స్లీప్ బెటర్, ఫీల్ బెటర్ అంటూ ఉాపాసన అభిమానులకు స్ట్రెస్ బర్నింగ్ టెక్నిక్ వివరించారు.

    English summary
    "My #topsecret way of dealing with everyday stress &negativity .It’s really easy - u feel sooooo much better after this ! U will loose belly fat & get healthier only if u de stress . 😊 try this tonight - and let me know how u feel. Have a restful sleep." Upasana tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X