»   » లవ్ లాక్ ఎప్పుడో పడింది: ఉపాసన వాలంటైన్స్ డే ట్వీట్..

లవ్ లాక్ ఎప్పుడో పడింది: ఉపాసన వాలంటైన్స్ డే ట్వీట్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ ప్రేమ జంటల గురించి చెప్పుకుంటే..... అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్-ఉపాసన గురించే. టాలీవుడ్లో ఉన్న అందరి లవ్ స్టోరీల కంటే వీరి లవ్ స్టోరీ చాలా డిఫరెంట్. స్కూల్ డేస్‌ నుండే వీరిద్దరూ ఫ్రెండ్స్. అప్పటి నుండి వీరి ప్రేమ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. సాధారణంగా అయితే స్కూలు, కాలేజీ ప్రేమలు కొంతదూరం వరకు మాత్రమే ప్రయాణిస్తాయి. అయితే చెర్రీ-ఉపాసన దాన్ని అక్కడితో ఆపేయలేదు. జీవితాంతం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

 వాలంటైన్స్ డే సందర్భంగా ఉపాసన ట్వీట్

వాలంటైన్స్ డే సందర్భంగా ఉపాసన ట్వీట్

వాలంటైన్స్ డే సందర్భంగా ఉపాసన ట్విట్టర్ ద్వారా ప్రపంచ ప్రేమికులను విష్ చేశారు. రామ్ చరణ్‌తో తనకు లవ్ లాక్ పడిందని, జీవితాంతం అది లాక్ అయ్యే ఉంటుందని ఉపాసన తెలిపారు.

లవ్ లాక్

లవ్ లాక్

రామ్ చరణ్, తాను కలిసి వేసిన లవ్ లాక్ ఫోటోలను ఈ సందర్భంగా ఉపాసన అభిమానులతో పంచుకున్నారు.

అందం చూసి ప్రేమించలేదు

అందం చూసి ప్రేమించలేదు

రామ్ చరణ్, ఉపాసన మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. వీరిది ఆకర్షణతో మొదలైన ప్రేమ కాదు. వీరి స్వచ్ఛమైన ప్రేమలో పైకి కనిపించే అందానికి దానికి విలువ లేదు. రెండు అందమైన మనసులు మాత్రమే వీరి ప్రేమలో ప్రధాన భూమిక పోషించాయి. అవి మ్యాచ్ అయ్యాయి కాబట్టే ఇద్దరి బంధం పెళ్లి వరకు వచ్చింది.

కులం, మతం, ప్రాంతం

కులం, మతం, ప్రాంతం

చాలా ప్రేమ కథల్లో కులం, మతం, కొన్ని సందర్భాల్లో ప్రాంతం కూడా అడ్డుగోడగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితుల సహకారం ఉండటంతో ఆ గొడలను కూల్చేసి తమ ప్రేమను గెలిపించుకున్నారు చరణ్-ఉపాసన.

విమర్శలు పట్టించుకోలేదు

విమర్శలు పట్టించుకోలేదు

రామ్ చరణ్-ఉపాసన పెళ్లి సమయంలో చాలా విమర్శలు వచ్చాయి. కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అవేమీ పట్టించుకోకుండా దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టి బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.

వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ

వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ

రామ్ చరణ్ సినీ నటుడిగా, నిర్మాతగా చాలా బిజీగా గడుపుతుంటారు. ఉపాసన బిజినెస్ ఉమెన్‌గా తీరిక లేకుండా గడుపుతుంటారు. ఇద్దరూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు. వీరి ప్రేమ ఇలానే కలకాలం కొనసాగాలని విష్ చేస్తూ వారికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం.

English summary
A recent picture which Upasana posted on her Twitter is one example to prove that they are 'Made for each other'. The picture shows Upasana and Ram Charan together. She quotes "#happyvalentinesday - to us locking our love forever #ramcharan".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu